బాహుబలిని కొట్టేది అదేనా?

ఆమిర్‌ ఖాన్‌ ఇండియాలో ఎంత పెద్ద స్టార్‌ అనేది తెలిసిందే. ఇప్పుడు చైనాలో కూడా ఆమిర్‌ సూపర్‌స్టార్‌. దంగల్‌ అక్కడ వెయ్యి కోట్లు వసూలు చేయడం అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఆ సినిమాలో వున్న…

ఆమిర్‌ ఖాన్‌ ఇండియాలో ఎంత పెద్ద స్టార్‌ అనేది తెలిసిందే. ఇప్పుడు చైనాలో కూడా ఆమిర్‌ సూపర్‌స్టార్‌. దంగల్‌ అక్కడ వెయ్యి కోట్లు వసూలు చేయడం అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఆ సినిమాలో వున్న కంటెంట్‌ అలాంటిదంటూ మెచ్చుకున్నారు.

అయితే ఇండియాలో సరిగా ఆడని ఆమిర్‌ సినిమా 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' కూడా చైనాలో అయిదు వందల కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. దీంతో ఇక్కడ ఆమిర్‌ హాలీవుడ్‌ స్టార్ల మాదిరిగా సెటిల్‌ అయిపోయాడని క్లియర్‌ అవుతోంది.

బాహుబలి 2 చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేస్తే అక్కడ అంతగా పట్టించుకోలేదు. ఇండియాలో, అమెరికాలో అదరగొట్టిన బాహుబలి 2కి మరెక్కడా అంత క్రేజ్‌ రాలేదు. కొత్తగా స్టాండర్డ్‌ అయిపోయిన చైనీస్‌ మార్కెట్‌ నేపథ్యంలో ఆమిర్‌ ఖాన్‌ తదుపరి చిత్రం 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌'పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

బాహుబలి రికార్డులని ఇండియాలో అధిగమించడం ఈసినిమా వల్ల అవుతుందో లేదో కానీ ప్రపంచ వ్యాప్తంగా మాత్రం బెంచ్‌ మార్క్‌ భారీ లెవల్లో సెట్‌ అవుతుందని అనుకుంటున్నారు.

బాహుబలి 2మార్కెట్‌ చూసిన తర్వాత ముందుగా దానిని టార్గెట్‌ చేస్తోన్న హీరో ఆమిర్‌ ఖానే. అయితే దక్షిణ భారతంలో బాహుబలి 2వసూళ్లని అందుకోవడం అంత సులభం కాదు. హిందీ వెర్షన్‌తో బాహుబలి సెట్‌ చేసిన రికార్డులని మాత్రం థగ్స్‌ తుడిచి పెట్టేస్తుందనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. చైనాలో అయితే ఇండియాతో పాటు డైరెక్ట్‌ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.