ప్రస్తుతం వీళ్లిద్దరే యమ హాట్‌

సూపర్‌స్టార్లతో సినిమాలు గ్యాంబ్లింగ్‌ తరహాలో తయారయిన నేపథ్యంలో మినిమం గ్యారెంటీ అనిపించుకునే మీడియం రేంజ్‌ హీరోలతోనే ఇప్పుడు ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. ఎనభై నుంచి వంద కోట్ల బిజినెస్‌ జరిగితే కనుక బ్లాక్‌బస్టర్‌ టాక్‌…

సూపర్‌స్టార్లతో సినిమాలు గ్యాంబ్లింగ్‌ తరహాలో తయారయిన నేపథ్యంలో మినిమం గ్యారెంటీ అనిపించుకునే మీడియం రేంజ్‌ హీరోలతోనే ఇప్పుడు ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. ఎనభై నుంచి వంద కోట్ల బిజినెస్‌ జరిగితే కనుక బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తే తప్ప సినిమాలు బతికి గట్టెక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఇరవై, ముప్పయ్‌ కోట్ల రేంజి సినిమాలకి రెక్కలొచ్చాయి.

ఈ రేంజ్‌లో నాని సూపర్‌స్టార్‌గా అవతరించగా, మరికొందరు యువ హీరోలు కూడా దూసుకుపోతున్నారు. నాని అమాంతం తన పారితోషికం పెంచేసి తొమ్మిది కోట్లు అడుగుతూ వుండేసరికి ఇప్పుడు అతడి కంటే కూడా విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ బెటర్‌ అని నిర్మాతలు వాళ్ల వైపు వెళుతున్నారు. వీళ్లిద్దరికీ యూత్‌లో క్రేజ్‌ వుండడం, వీళ్లు చేసే సినిమాలకి బిజినెస్‌ స్పీడ్‌గా వుండడం, అన్నిటికీ మించి ఇద్దరూ అందుబాటు ధరల్లో వుండడం తమవైపుకి నిర్మాతలని ఆకర్షిస్తోంది.

మరో వైపు ఈ రేంజ్‌లో ఎప్పుడో స్థిరపడిన రామ్‌, నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌లాంటి వాళ్లు హిట్ల కోసం స్ట్రగుల్‌ అవుతూ వుండడం కూడా ఈ యువ హీరోలకి మరింతగా కలిసి వస్తోంది. మాస్‌ సినిమాల జోలికి పోకుండా ఈ మార్కెట్‌కి రాజపోషకులైన యూత్‌, ఫ్యామిలీస్‌ని నమ్ముకుని వీళ్లు తమ కెరీర్లని పక్కాగా తీర్చిదిద్దుకుంటున్నారు.