గ్యాసిప్ లు ఇలా వుంటాయని, వస్తాయని సినిమారంగంలోకి రాకముందే తెలుసు అని, వాటికి సిద్దపడే నటిగా పయనం ప్రారంభించానని అంటోంది కొణిదెల నీహారిక. తన తమిళ సినిమాల ప్రమోషన్ టైమ్ లో నీహారికకు ఈతరహా ప్రశ్నలు ఎదురుకాక తప్పడం లేదు.
అన్నింటికన్నా ముఖ్యంగా హీరో నాగశౌర్యతో పెళ్లి అనే రూమర్ గురించి ఎక్కువగా అడుగుతున్నారట. దానికి నీహారిక తనకు చాలా మంది కొలీగ్స్ మాదిరిగానే నాగశౌర్య కూడా జస్ట్ ఓ ఫ్రెండ్ అని బదులిస్తోంది.
ఇప్పుడు నాగశౌర్య అన్నారు. ఇంతకు ముందు ఎవరెవరో అన్నారు. ఆఖరికి తన కజిన్ ల పేర్లు ముడిపెట్టారు. ఇవన్నీ విని విని, అలవాటైపోయింది. మొదట్లో కాస్త బాధనిపించినా, ఏం చేయలేమని తెలిసాక అలవాటు చేసుకున్నా అంటోంది. ఇలాంటి వాటి వల్ల తన మైండ్ సెట్ మారిపోదని, తన కెరీర్ మారిపోదని, తనేంటో తనకు, తన ఫ్యామిలీకి తెలుసు అని అంటోంది నీహారిక.
మొత్తానికి నీహారిక సరైన సమాధానాలే ఇస్తోంది. చేసిన సినిమాలు తక్కువే అయినా, సినిమా ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసిన అనుభవం ఎక్కువే వుంది. అందుకే చాలా త్వరగా నేర్చుకుని, గ్యాసిప్ లను పట్టించుకోకుండా వుండగలుగుతోంది.