నాని అ! సినిమా సోషియో ఫాంటసీ?

నాని తనే స్వయంగా నిర్మాతగా మారి తీస్తున్న సినిమా అ!. ఈసినిమాకు ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోలు, టీజర్, ట్రయిలర్ కలిపి, ఓ డిఫరెంట్ మూవీ లుక్ తీసుకువచ్చాయి. Advertisement ఈసినిమాకు సంబంధించి…

నాని తనే స్వయంగా నిర్మాతగా మారి తీస్తున్న సినిమా అ!. ఈసినిమాకు ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోలు, టీజర్, ట్రయిలర్ కలిపి, ఓ డిఫరెంట్ మూవీ లుక్ తీసుకువచ్చాయి.

ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈసినిమా మొత్తం ఓ ఫైవ్ స్టార్ హోటల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని. అందుకోసమే ఓ కీలకమైన స్టార్ హోటల్ కిచెన్ సెట్, రెస్టారెంట్ సెట్ వేసినట్లు తెలుస్తోంది.

వంట సరిగ్గా రాకుండానే స్టార్ హోటల్ లో చెఫ్ గా చేరే కుర్రాడు, యూ ట్యూబ్ విడియోలతో కిందా మీదా అవుతుంటే, అక్కడే వుండే అక్వేరియంలోని చేప సలహాలు ఇచ్చి ఆదుకుంటూ వుంటుంది.

తనకెలా తెలుసు వంట అంటే అన్నాళ్ల బట్టి అదే కిచెన్ అక్వేరియంలో వుంటూ, రకరకాల చెఫ్ లు చేసిన వంటలు చూస్తూ నేర్చేసుకుందన్నమాట. అదే సమయంలో అక్కడే వుండే బోన్ సాయ్ మొక్క సెటైర్లు వేస్తూ, ఆటపట్టిస్తూ వుంటుందని వినికిడి.

ఇలా ఫన్ ఎలిమెంట్ ప్రధానంగా వుండే కథ, ఆ హోటల్ కు వచ్చిపోయే రకరకాల క్యారెక్టర్లు, అక్కడ జరిగే కీలక సంఘటన కలిసి అ! సినిమా కథగా తెలుస్తోంది. మొత్తం మీద ఆసక్తికరంగానే వుండేలా వుంది. అయితే ఇంత డిఫరెంట్ స్టోరీ అనేసరికి మన సినిమా జనాలకు ఒకటే అనుమానం. ఇదెక్కడి నుంచి తెచ్చి వుంటారా? ఇన్ స్పియర్ అయివుంటారా? అని.

అందుకే ఇదే పనిపై చాలా మంది నెట్ ను తెగ కెలికేస్తున్నారని వినికిడి. దొరికితే బయటకు వస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వర్మ అనే కొత్త దర్శకుడి ఓన్ స్టోరీ.