మారుతి సినిమాలో దాసరి

దాసరి అరుణ్ కుమార్ మళ్లీ ఇప్పుడిప్పుడే తెరమీదకు వస్తున్నాడు. తండ్రి, దర్శకుడు దాసరి మరణించిన తరువాత, మళ్లీ తేరుకుని, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడు. ఆ మధ్య ఒక్క క్షణం సినిమాలో విలన్ గా…

దాసరి అరుణ్ కుమార్ మళ్లీ ఇప్పుడిప్పుడే తెరమీదకు వస్తున్నాడు. తండ్రి, దర్శకుడు దాసరి మరణించిన తరువాత, మళ్లీ తేరుకుని, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడు. ఆ మధ్య ఒక్క క్షణం సినిమాలో విలన్ గా కనిపించాడు. ఇప్పుడు మరో సినిమాలో కూడా చిన్న విలన్ పాత్ర చేయబోతున్నాడు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు మారుతి డైరక్షన్ లో నిర్మిస్తున్న శైలజరెడ్డి అల్లుడు సినిమాలో ఒక క్యారెక్టర్ కు దాసరి అరుణ్ కుమార్ ను అనుకుంటున్నారు. ఒక విధంగా విలన్ షేడ్ వున్న క్యారెక్టరే. అయితే మరీ ఫుల్ లెంగ్త్ కాదని తెలుస్తోంది. కానీ ప్రాధాన్యత వున్న క్యారెక్టర్ నే కావడంతో అరుణ్ కుమార్ ను తీసుకున్నారు.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఇదిలా వుంటే మరో ఒకటి రెండు సినిమాల్లో కూడా అరుణ్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సీరియస్ గా సినిమాల్లోనే కొనసాగాలని అరుణ్ కుమార్ డిసైడ్ అయ్యారు.