భాగమతి.. యువికి బహుమతి

మొత్తానికి యువి అదృష్టం బాగుంది. తెల్లఏనుగు అయిపోతుందేమో అని అందరూ గుసగుసలు పోయిన భాగమతి సినిమా తెలుగు వెర్షన్ పాతిక కోట్ల షేర్ తెచ్చిపెట్టింది. ఇది కాకుండా, తమిళ, మలయాళ వెర్షన్లు, మరి కొన్ని…

మొత్తానికి యువి అదృష్టం బాగుంది. తెల్లఏనుగు అయిపోతుందేమో అని అందరూ గుసగుసలు పోయిన భాగమతి సినిమా తెలుగు వెర్షన్ పాతిక కోట్ల షేర్ తెచ్చిపెట్టింది. ఇది కాకుండా, తమిళ, మలయాళ వెర్షన్లు, మరి కొన్ని హక్కులతో కలిసి పదిహేను కోట్ల వరకు వచ్చాయి.

ఇంకా తెలుగు శాటిలైట్ వుండనే వుంది. అంటే సుమారు 40కోట్ల బిజినెస్ పక్కాగా జరిగింది. మలయాళం, తమిళ్ అమ్మేసారు కాబట్టి అక్కడ కలెక్షన్ల లెక్కలు పక్కన పెట్టాల్సిందే. సినిమాకు ముఫై అయిదు కోట్లకు పైగానే ఖర్చయింది. రెండేళ్ల పాటు సిబ్బంది వ్యవహారం, వడ్డీలు అన్నీ కలిపితేనే ఈ అమౌంట్.

అంటే ఫస్ట్ టెన్ డేస్ రన్నింగ్ లో డబ్బులు వచ్చేసి, కాస్తో కూస్తో మిగిలేలా వుంది. ప్రస్తుతానికి పెద్దగా రన్ లేదు. అలా అని డెఫిసిట్ లేదు. కొద్ది పాటి షేర్ అయితే వస్తోంది. అందువల్ల ఎంతో కొంత వస్తున్న వరకు అలాగే వుంచుతారు కనుక మరి కాస్త లాభం వచ్చే అవకాశం వుంది.

పది రోజుల కలెక్షన్ల వివరాలు

నైజాం …7.20
సీడెడ్….2.41
ఉత్తరాంధ్ర..2.35
గుంటూరు ..1.41
ఈస్ట్…1.47
వెస్ట్..1.00
కృష్ణ…1.28
నెల్లూరు…0.80