ఆ మధ్య గుబురుగెడ్డంతో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి గెడ్డం తీసేసారు. అప్పుడే వెల్లడించాం ఇదంతా చిరు ఫేస్ ను కెమేరాలతో క్యాచ్ చేసి, కంప్యూటర్లలోకి ఎక్కించడానికి అని అప్పుడే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు ఈ విషయంలో మరికొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
గెడ్డం తీసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి చైనా బయల్దేరి వెళ్లారట. అక్కడ ఓ కంప్యూటర్ కంపెనీ తో ఒక సెషన్ కు హాజరయ్యారని వినికిడి. ఆ సంస్థ కొన్ని గంటల పాటు, కొన్ని వందల కెమేరాలతో చిరంజీవి ఫేస్ హావభావాలను కాప్చర్ చేసిందట.
మొహం, కళ్లు, ముక్కు, నోరు, దవడలు అన్నీ రకరకాలుగా కదులుస్తూ, రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ వుంటే, వందలాది కెమేరాలు వాటిని కాప్చర్ చేస్తూ వుంటాయట. వీటిని కంప్యూటర్లలోకి ఫీడ్ చేస్తారు. సినిమాను గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరించిన తరువాత కంప్యూటర్లలోకి ఫీడ్ చేసినపుడు, ఫేస్ ను పూర్తిగా అనుకున్న గెటప్ లో షేప్ వచ్చే విధంగా విజువల్ ఎపెక్ట్ రావడానికి ఈ వర్క్ అంతా ఉపయోగపడుతుందట.
అందుకోసమే గెడ్డం తీసేసి చైనా వెళ్లి వచ్చారు చిరంజీవి. అయితే ఈ షూట్ కు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వెళ్లాల్సి వుంది. అనుకోని అవాంతరం రావడం వల్ల ఆయన వెళ్లలేదు. ఇప్పుడు గెడ్డం పెంచే పనిలో వున్నారు చిరు. ఆ తరువాత మళ్లీ సెట్ మీదకు వెళ్తారు.