కాజల్ ఎంట్రీ: ఒకరికి ప్లస్… మరొకరికి మైనస్!

ఒకరికేమో ఆమె లక్కీ హీరోయిన్. మరొకరికి ఫ్లాప్ హీరోయిన్. అలాంటి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ కు చోటిస్తారా..? ప్రస్తుతం ఈ యాంగిల్ లోనే చర్చలు సాగుతున్నాయి. వాళ్లిద్దరూ రవితేజ,…

ఒకరికేమో ఆమె లక్కీ హీరోయిన్. మరొకరికి ఫ్లాప్ హీరోయిన్. అలాంటి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ కు చోటిస్తారా..? ప్రస్తుతం ఈ యాంగిల్ లోనే చర్చలు సాగుతున్నాయి. వాళ్లిద్దరూ రవితేజ, శ్రీనువైట్ల. ఆ హీరోయిన్ కాజల్.

శ్రీనువైట్ల, కాజల్ ది హిట్ కాంబినేషన్. వైట్ల తీసిన బాద్ షా సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అయింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమెను రిపీట్ చేసే ఛాన్స్ రాలేదు వైట్లకు. ఎట్టకేలకు రవితేజ సినిమా కోసం సెంటిమెంట్ కొద్ది కాజల్ ను తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

అయితే రవితేజ, కాజల్ ది ఫ్లాప్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన వీర, సారొచ్చారు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కాజల్ కు మాస్ రాజా మరో ఛాన్స్ ఇస్తాడా అనేది అనుమానాస్పదం.

అయితే ఇలాంటి సెంటిమెంట్స్ రవితేజ పెద్దగా పట్టించుకోడంటారు. అదే కనుక జరిగితే కాజల్ కు లైన్ క్లియర్ అయినట్టే. ఇక ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నివేత థామస్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు వైట్ల.