సమ్మర్ బరిలోకి నిఖిల్?

కిర్రాక్ పార్టీతో ఫిబ్రవరిలోనే అభిమానులను పలకరిద్దాం అనుకున్నాడు హీరో నిఖిల్. కానీ సినిమా వర్క్ పూర్తి కాలేదు. వాయిదా వేయక తప్పలేదు. అయితే ఈ వాయిదా కేవలం రోజులుకా? నెలలుకా అన్నది పాయింట్. ఈ…

కిర్రాక్ పార్టీతో ఫిబ్రవరిలోనే అభిమానులను పలకరిద్దాం అనుకున్నాడు హీరో నిఖిల్. కానీ సినిమా వర్క్ పూర్తి కాలేదు. వాయిదా వేయక తప్పలేదు. అయితే ఈ వాయిదా కేవలం రోజులుకా? నెలలుకా అన్నది పాయింట్. ఈ నెల 16లేదా 24కు అయితే బెటర్ అని నిర్మాత అనిల్ సుంకరకు వుంది. కానీ హడావుడి పడకుండా మాంచి టైమ్ చూసి వదులుదామన్నది నిఖిల్ ఆలోచన.

ఏప్రియల్ ఫస్ట్ వీక్ మీద నిఖిల్ కన్ను వుంది. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ మూవీ కనుక, అప్పుడు హాలీడేస్ సీజన్ కనుక. అందుకే సమ్మర్ బరిలోకే వెళ్దామని పట్టుపడుతున్నట్లు వినికిడి.

ఇదిలా వుంటే ఒక పక్క కిర్రాక్ పార్టీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే, మరోపక్క టాగోర్ మధు నిర్మించే గణితన్ రీమేక్ స్క్రిప్ట్ డిస్కషన్లు కూడా స్టార్ట్ చేసాడు నిఖిల్. ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది. సెకెండాఫ్ మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ సినిమా 19 నుంచి షూటింగ్ కు వెళ్తుంది.