బోయపాటి సినిమా అంటే కత్తులు దిగాల్సిందే. పీకలు తెగాల్సిందే. నెత్తురు పారాల్సిందే. హింస.. హింస.. హింస భయంకరంగా వుంటుంది ఆయన సినిమాల్లో. అదే టైమ్ లో భారీ ఫ్యామిలీలు, బంధాలు, అనుబందాలు కూడా వుంటాయి. ఇప్పుడు బోయపాటి ఓ సినిమా మెగా హీరో రామ్ చరణ్ తో చేస్తున్నారు. ఇంకా రామ్ చరణ్ అయితే సెట్ మీదకు రాలేదు.
అయితే ఈ సినిమా విషయంలో ముందుగానే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి రెండు విషయాలు బోయపాటికి క్లియర్ చేసినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. ఒకటి యాక్షన్ పార్ట్ ఎంతయినా వుండొచ్చు కానీ, రక్తపాతాలు తగ్గించమని, రెండవది బోయపాటి సినిమాలో ఫన్ చాలా తక్కువ వుంటుంది. ఆ ఒక్క దగ్గర బోయపాటి బాగా వీక్. కానీ ఈ సినిమాలో ఫన్ మిస్ కాకుండా చూడమని అడిగారట మెగాస్టార్.
అంటే యాక్షన్ వుండాలి. బ్లడ్ ధారలు వుండకూడదు. యాక్షన్ తో పాటు ఫన్ కూడా పండాలి. ఇదేదో బాగానే వుంది. ఇంకా మెగా ప్యాన్స్ డిమాండ్ లు ఎన్ని వుంటాయో? బోయపాటికి. తప్పదు మరి. సినిమా ఒకె అన్నాక.