టెంపర్ కథకు కోటి రూపాయల పారితోషికం అందుకుని, వార్తల కెక్కాడు వక్కంతం వంశీ. అబ్బో గొప్ప కథకుడు కదా? టెంపర్ క్లయిమాక్స్ లో కీలకమైన పాయింట్ తప్పిస్తే, మిగిలినదంతా రోటీన్ పూరి వ్యవహారమే. వక్కంతంకు తొలి టర్నింగ్ పాయింట్ అయిన కిక్ కథలో సగం శంకర్ జెంటిల్ మన్ నుంచి తెచ్చినదన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు లేటెస్ట్ గా టచ్ చేసి చూడు సినిమాకు కూడా కథ వక్కంతంనే వండి వార్చాడు. పాపం, స్వతహాగా రచయిత అయిన విక్రమ్ సిరికొండ ఓ కథ తెస్తే, రవితేజ అది కాదని, వక్కంతంతో కథ చెప్పించి, దాన్ని చేతిలో పెట్టాడు. దాంతో తప్పనిసరి అయి ఆ కథనే తీసుకుని చేసాడు.
పక్కా సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి ఫ్యాక్షనిస్టు కథను, పోలీస్ కథగా మార్చి, పాత, కథను ఇచ్చి, ఇటు నిర్మాతలను, అటు రవితేజను ఒప్పించగలిగిన వక్కంతం చాతుర్యానికి హ్యాట్సాఫ్. వక్కంతం లేటెస్ట్ గా చేస్తున్న నా పేరు సూర్య సినిమాకు కూడా హాలీవుడ్ అనుసరణే అని ఇప్పటికే పక్కగా రుజువుల్తో సహా వార్తలు బయటకు వచ్చేసాయి.
ఈ సినిమా జనాలు ఇలాంటి కథలనే ఎలా నమ్మి కోట్లు కుమ్మరిస్తారో?