నాగచైతన్య, సమంత తర్వాత ఈ జంటదే హవా?

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించిన జంటలు చాలానే ఉన్నాయి. ఏఎన్నార్-వాణిశ్రీ నుంచి వెంకీ-సౌందర్య వరకు చాలా జంటలే ఉన్నాయి. కానీ రియల్ లైఫ్ లో అలా కెమిస్ట్రీ పండించిన జంటలు చాలా అరుదు. హీరోహీరోయిన్లు…

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించిన జంటలు చాలానే ఉన్నాయి. ఏఎన్నార్-వాణిశ్రీ నుంచి వెంకీ-సౌందర్య వరకు చాలా జంటలే ఉన్నాయి. కానీ రియల్ లైఫ్ లో అలా కెమిస్ట్రీ పండించిన జంటలు చాలా అరుదు. హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు టాలీవుడ్ లో చాలా చాలా తక్కువ. మొన్నటికి మొన్న నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నాగశౌర్య, నిహారిక చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మొదటి సినిమా కంప్లీట్ అయ్యేనాటికే నాగచైతన్య, సమంత మనసులు కలిశాయి. ఆటోనగర్ సూర్య సినిమా టైమ్ కే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ ప్రేమించుకున్న ఏడాదిన్నరకు గానీ ఆ విషయం బయటకు రాలేదు. ఆ తర్వాత సమంత ఈ మేటర్ ను బయటపెట్టడం, ఆ తర్వాత కొన్నాళ్లకు చైతూ-సమంత పెళ్లితో ఒకటవ్వడం చకచకా జరిగిపోయాయి.

ఈ జంట తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్నది నాగశౌర్య-నిహారిక పేర్లే. ఒక మనసు అనే సినిమాతో వీళ్లిద్దరూ కలిశారు. నిహారికకు అదే మొదటి సినిమా. ఆ సినిమా టైమ్ లో ఈ జంటకు మంచి మార్కులే పడ్డాయి. తెరపై ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటూ స్వయంగా మెగాహీరోలే కాంప్లిమెంట్లు ఇచ్చారు అప్పట్లో. 

ఆ సినిమా టైమ్ లో వీళ్లపై పెద్దగా పుకార్లు రాలేదు. కానీ గడిచిన 6 నెలలుగా వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఒక దశలో నిహారిక తండ్రి నాగబాబు, ఓ సందర్భంలో స్వయంగా చిరంజీవి ఈ వార్తలను ఖండించినప్పటికీ పుకార్లు ఆగలేదు. తాజాగా నాగశౌర్య కూడా ఈ మేటర్ పై స్పందించాడు. అయితే గట్టిగా ఖండించలేదు. ప్రస్తుతానికి తను సింగిల్ అని మాత్రం స్పష్టంచేశాడు.

మెగా కాంపౌండ్ లో ఇలాంటి రూమర్లు రావడం కొత్త కాదు. గతంలో హీరో ఉదయ్ కిరణ్ విషయంలో కూడా ఇలాంటి వదంతులే వచ్చాయి. చిరంజీవి కుమార్తెను ఉదయ్ కిరణ్ కు అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆ సంబంధం కుదరలేదు. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా బయటకు రాలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు మెగా అల్లుడు నాగశౌర్య అంటూ పుకార్లు వచ్చాయి. ఇది నిజంగానే పుకారుగా మిగిలిపోతుందా.. లేక కొన్నాళ్ల తర్వాత నాగచైతన్య-సమంత వ్యవహారంలా నిజరూపం దాలుస్తుందా అనేది కాలమే తేలుస్తుంది.