వెంకీకి హీరో కావాలి.

నిజమే తేజ సినిమా కోసం వెంకీకి హీరోయిన్ కావాలి. అలాగే పనిలో పనిగా అనిల్ రావిపూడి సినిమా కోసం ఓ హీరో కూడా కావాలి. రాజా ది గ్రేట్ సక్సెస్ తరువాత డైరక్టర్ అనిల్…

నిజమే తేజ సినిమా కోసం వెంకీకి హీరోయిన్ కావాలి. అలాగే పనిలో పనిగా అనిల్ రావిపూడి సినిమా కోసం ఓ హీరో కూడా కావాలి. రాజా ది గ్రేట్ సక్సెస్ తరువాత డైరక్టర్ అనిల్ రావిపూడి దృష్టి మల్టీస్టారర్ మీద పడింది. ఇద్దరు హీరోలతో మాంచి సినిమా చేయడానికి వీలుగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఒక హీరోగా విక్టరీ వెంకటేష్ ఫిక్సయిపోయారు కూడా. ప్రస్తుతం వెంకీ చేయబోయే తేజ సినిమా తరువాత ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతుంది. దిల్ రాజే నిర్మాత.

అయితే వెంకీ పక్కన చేసే రెండో హీరో ఎవ్వరు అన్నది మాత్రం ఎంతకీ సెట్ కావడంలేదట. వెంకీకి నచ్చాలి. అలా నచ్చిన వాళ్లు వెంకీతో చేయడానికి ఓకె అనాలి. ఇదే పెద్ద సమస్య. వెంకీలాంటి పెద్ద హీరో పక్కన యంగ్ హీరోను ఎవ్వర్ని తీసుకున్నా, కొంచెం అన్నా తక్కువే తప్ప సమానంగా క్యారెక్టర్ దక్కడం కష్టం. గతంలో వెంకీ చేసిన మల్టీస్టారర్ల విషయంలో ఇలాంటి అనేక గుసగుసలు వున్నాయి.

వాటన్నింటిని దృష్టిలో వుంచుకుని, ఏ యంగ్ హీరో కూడా ఓకె అనడం లేదని తెలుస్తోంది. దీంతో వెదుకులాట కొనసాగుతూనే వుంది. పైగా వెంకీ ఇప్పటికిప్పడు ఖాళీ కావడంలేదు. మే, జూన్ నాటికి ఆయన రెడీ అవుతారు. ఆ టైమ్ కు ఎవ్వరు దొరుకుతారో, వెంకీ సరసన నటించడానికి చూడాలి.

అనిల్ రావిపూడి డైరక్షన్, దిల్ రాజు నిర్మాత అన్నంత వరకు అందరికీ ఓకెనే. కానీ మల్టీస్టారర్ అంటేనే సమస్యగా వుంది.