రాజమౌళి-ట్విటర్ వైరాగ్యం?

సెలబ్రిటీల ట్విట్టర్ అక్కౌట్లంటే కాస్త ఆసక్తే. ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తారో అని ఫాలోవర్లు చూస్తుంటారు. అలాంటి అక్కౌంట్లలో ఒకటి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిది. సినిమా ఎవరిది అన్నది చూడకుండా, మంచిసినిమా వస్తే…

సెలబ్రిటీల ట్విట్టర్ అక్కౌట్లంటే కాస్త ఆసక్తే. ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తారో అని ఫాలోవర్లు చూస్తుంటారు. అలాంటి అక్కౌంట్లలో ఒకటి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిది. సినిమా ఎవరిది అన్నది చూడకుండా, మంచిసినిమా వస్తే వెంటనే ప్రశంసలు కురిపిస్తారు.

అలాగే మంచి ట్రయిలర్లు, టీజర్లు తన దైన కామెంట్ జోడించి షేర్ చేస్తారు. అలాంటిది ఇటీవల ట్విట్టర్ లో ఆయన యాక్టివ్ నెస్ తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. బహుశా రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబో సినిమా స్క్రిప్ట్ మీద బిజీ అయిపోయారేమో?

లేకపోతే, ట్విట్టర్ మీద ఆయనకు ఆసక్తి తగ్గిందా లేకపోతే, ట్విట్టర్ లో ఇష్టం వచ్చినట్లు చేసే కామెంట్లు చికాకు కలిగిస్తున్నాయా? గతంలో పైసా వసూల్ సినిమా విషయంలో ఆయన ట్విట్టర్ జనాల నుంచి విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి రాజమౌళి ట్వీట్ లు కాస్త తగ్గించారు. చేసినా కూడా రొటీన్ విసెష్ లేదా తన బాహుబలికి సంబంధించినవే చేస్తూ వస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఆయన ట్వీట్ లు చేసినా అ! టీజర్, అలాగే రంగస్థలం టీజర్ మాత్రమే. భాగమతి సినిమా గురించి కానీ, అలాగే నిన్నటికి నిన్న వచ్చిన అ! ట్రయిలర్ గురించి కానీ ఆయన ట్వీట్ లు వేయలేదు. ఇంత హడావుడి సృష్టించిన ఆర్జీవీ జీఎస్టీని పట్టించుకోలేదు. పండగకు వచ్చిన బాలయ్య జై సింహా సినిమాకు అయితే సరేసరి. నిన్నటికి నిన్న తన సన్నిహితుడు సాయి కొర్రపాటి కోసం మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మీద ఫస్ట్ షాట్ డైరక్ట్ చేసారు. ఆ సంగతీ మరిచారు.

ఇదంతా పైసా వసూల్ తరువాత రాజమౌళికి ట్విట్టర్ మీద కలిగిన వైరాగ్యమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనవసరంగా ఓపెన్ ఫ్లాట్ ఫారమ్ లోకి వెళ్లి కెలుక్కోవడం ఎందుకు అని రాజమౌళి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.