నాలుగు అయిదు రోజుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ తొలిప్రేమ సినిమా ఒక రోజు ఆలస్యంగా విడుదలవుతుందని. ఎందుకంటే రెండు మెగా సినిమాలు ఒకేరోజు విడుదలవడం మంచి సంకేతం కాదని, మెగా క్యాంప్ పెద్దలు సూచించారని.
దీనికి తోడు రెండు సినిమాలకు ఓ పక్కన యుద్ద ప్రాతిపదికన వర్క్ జరుగుతోంది. తొలిప్రేమ నిర్మాత భోగవిల్లి ప్రసాద్ చెన్నయ్ లోనే వుండిపోయారు ఈ వర్క్ కావడం కోసం.
ఇలాంటి టైమ్ లో అల్లు అరవింద్ కలుగచేసకుని, దిల్ రాజుకు చెప్పడం, ఆయన కూడా సరే అని ఒకరోజు వెనక్కు వెళ్లడానికి ఓకె అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు తొలి ప్రేమను అవుట్ రేట్ కు కొనుగోలు చేసి, పంపిణీ చేస్తున్నారు.
ఆయనకు ఈ సినిమా ఇష్టమే. మరోపక్క పోటీగా వున్న సాయిధరమ్ తేజ అంటే కాస్త అభిమానమే. అందుకే తన సినిమాను ఓరోజు వెనక్కు జరిపారు.
అంటే 9న కిర్రాక్ పార్టీ, గాయత్రి, ఇంటిలిజెంట్, 10న తొలిప్రేమ విడుదలవుతాయన్నమాట. లేదూ ఈ లోగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఏమన్నా మనసు మార్చుకుంటే కిర్రాక్ పార్టీ డేట్ కూడా మారే అవకాశం వుంటుందేమో?