రాజమండ్రిలో ఇంటిలిజెంట్

ఈ మధ్య సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లో చేయడం బోర్ కొట్టేస్తోంది. కాస్త అలా అలా కొత్త ప్రాంతాల్లో చేయాలనుకుంటున్నారు. Advertisement అందుకే తిరుపతి, విశాఖ, విజయవాడే కాకుండా, వరంగల్, రాజమండ్రి లాంటి ఊళ్లలో…

ఈ మధ్య సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లో చేయడం బోర్ కొట్టేస్తోంది. కాస్త అలా అలా కొత్త ప్రాంతాల్లో చేయాలనుకుంటున్నారు.

అందుకే తిరుపతి, విశాఖ, విజయవాడే కాకుండా, వరంగల్, రాజమండ్రి లాంటి ఊళ్లలో కూడా సినిమా ఫంక్షన్ లు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా వివి వినాయక్ తన సినిమా ఇంటిలిజెంట్ ఫంక్షన్ కు కూడా తన నేటివ్ ప్లేస్ కు దగ్గరగా చేయాలనుకుంటున్నారట.

వివి వినాయక్ ది రాజమండ్రి దగ్గరల్లోని చాగల్లు. అందుకే కావచ్చు. ఆయన ఇంటిలిజెంట్ పంక్షన్ కు రాజమండ్రిని వెన్యూగా చేసుకున్నారట. ఫిబ్రవరి నాలుగు సాయంత్రం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఇంటిలిజేంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు.

ఈ ఫంక్షన్ కోసం ఇక్కడి నుంచి ఇంటిలిజెంట్ స్టార్స్ అంతా తరలి వెళ్లారట, హీరో సాయిధరమ్ తేజ్ తో సహా. అసలే ఈస్ట్ గోదావరి అంటే మెగా ఫ్యాన్స్ కు అడ్డా. అలాంటి చోట ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారంటే, వివి వినాయక్ ఇంటిలిజెంట్ నే.