ఎకే బ్యానర్ లో అల్లరి నరేష్

చాన్నాళ్లయింది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అల్లరి నరేష్ నటించి. ఆ బ్యానర్ అధినేత అనిల్ సుంకర తన సరదా మేరకు బోలెడు ఖర్చుచేసి యాక్షన్ 3డి సినిమా చేసారు. బోలెడు…

చాన్నాళ్లయింది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అల్లరి నరేష్ నటించి. ఆ బ్యానర్ అధినేత అనిల్ సుంకర తన సరదా మేరకు బోలెడు ఖర్చుచేసి యాక్షన్ 3డి సినిమా చేసారు. బోలెడు ఖర్చు చేసారు. కానీ సక్సెస్ కాలేదు.

ఆ తరువాత మళ్లీ అల్లరి నరేష్ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఎకె లో అల్లరి నరేష్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది.

గిరి అనే దర్శకుడు తెచ్చిన కథ పక్కాగా అల్లరి నరేష్ కు సూట్ అవుతుందని భావించడంతో ఈ సినిమా ఫిక్స్ అయింది. గతంలో నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమా తీసాడు ఈ దర్శకుడు. సినిమా పెద్దగా ఆడకపోయినా, ఫరావాలేదనే పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ చాన్స్ సులువయింది.

ప్రస్తుతం అల్లరి నరేష్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది సునీల్ కాంబినేషన్ లోని భీమినేని శ్రీనివాసరావు సినిమా. అదీ, ఇదీ రెండూ సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయి.