ఆ సినిమా పబ్లిసిటీకి మూడు కోట్లు

ఇదేమీ నాగశౌర్య రెమ్యూనిరేషన్ సంగతి కాదు. అతగాడి సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్న ఖర్చు. సరైన హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు హీరో నాగశౌర్య. అందుకోసం అతగాడి ఫ్యామిలీనే రంగంలోకి దిగింది. త్రివిక్రమ్ అసిస్టెంట్…

ఇదేమీ నాగశౌర్య రెమ్యూనిరేషన్ సంగతి కాదు. అతగాడి సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్న ఖర్చు. సరైన హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు హీరో నాగశౌర్య. అందుకోసం అతగాడి ఫ్యామిలీనే రంగంలోకి దిగింది. త్రివిక్రమ్ అసిస్టెంట్ వెంకీ కుడుమల, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ ల జోడీని ఎంచుకుంది. ఛలో అంటూ సినిమా స్టార్ట్ చేసింది.

అక్కడితో ఆగకుండా సినిమా కోసం ఖర్చు చేయడం వేరు, ఆ సినిమాను జనం దగ్గరకు చేర్చడానికి ఖర్చు చేసే పని పెట్టుకుంది. ఇప్పటికి రెండునెలల బట్టి ఛలో సినిమా పబ్లిసిటీ చేస్తూనే వున్నారు. ఫిబబ్రరి 2న విడుదలయ్యే ఈ సినిమాకు పబ్లిసిటీ బడ్జెట్ జస్ట్ మూడుకోట్లు.

హోర్డింగ్ లు, గూగుల్ ప్రకటనలు, ఎక్కడికక్కడ ప్రమోషన్ మీట్ లు, వెహికిల్స్, వందలాది థియేటర్లలో ట్రయిలర్ ప్రదర్శన, ఇలా పబ్లిసిటీ కోసం డబ్బు జల్లేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా కోసం  దాదాపు మూడు నాలుగు మీడియా మీట్ లు చేసారు. అన్ని చానెళ్లలో ప్రైమ్ టైమ్ చాటింగ్ షోలు తయారుచేసి వుంచారు. ఇవన్నీ ఒకఎత్తు, టీవీలో ప్రకటనలు ఒకఎత్తు.

నిజానికి నాగశౌర్యతో మరెవరు సినిమా తీసినా, నాలుగయిదు కోట్లతో తీసి, ఓ యాభై లక్షలు పబ్లిసిటీ చేస్తారు. కానీ స్వంత బ్యానర్ కావడంతో, ఆరున్నర కోట్లతో సినిమా తీసి, మూడుకోట్లు పబ్లిసిటీకి స్పెండ్ చేస్తున్నారు. అదృష్టం ఏమిటంటే, శాటిలైట్, డిజిటల్, దాదాపు 95శాతం థియేటర్ రైట్స్ అన్నీ మార్కెట్ చేసి తొమ్మిది కోట్ల మేరకు రికవరీ చేసుకోగలగడం.

చేతిలో మూడు మంచి ప్రాజెక్టులు వున్నాయి కానీ, ఇలాంటి చాన్స్ శౌర్యకు అయితే మళ్లీ రాదు. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి.