ఆ రెండు సినిమాలకు రాజ్ తరుణ్ బలి

అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ థియేటర్ల నుంచి లేపేసే పరిస్థితి లేదు. జై సింహాది కూడా ఇదే పరిస్థితి. అటు గ్యాంగ్ సినిమా ఉన్నంతలో మంచి మౌత్ టాక్ తో రోజురోజుకు తన…

అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ థియేటర్ల నుంచి లేపేసే పరిస్థితి లేదు. జై సింహాది కూడా ఇదే పరిస్థితి. అటు గ్యాంగ్ సినిమా ఉన్నంతలో మంచి మౌత్ టాక్ తో రోజురోజుకు తన వసూళ్లు పెంచుకుంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లిక్ డే కానుకగా వస్తున్న సినిమాల కోసం దేన్ని సైడ్ చేయాలి. ఉందిగా రంగుల రాట్నం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

అవును.. సంక్రాంతి సినిమాల్లో సోదిలో లేకుండా పోయింది ఈ ఒక్క సినిమానే. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అవుతుందని భావించి, హెవీ కాంపిటిషన్ ఉన్నప్పటికీ రంగులరాట్నం రిలీజ్ చేశాడు నాగార్జున. కానీ ఈ సినిమా ఎవర్నీ మెప్పించలేదు. ఫలితంగా థియేటర్లలోకి వచ్చిన వారం రోజులకే దుకాణం సర్దేసింది.

జనవరి 26కి ఆచారి అమెరికా యాత్ర, భాగమతి సినిమాలు వస్తున్నాయి. భాగమతికి భారీగా థియేటర్ల కోసం చూస్తోంది యూవీ క్రియేషన్స్. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే చాలా ఖర్చుచేశారు నిర్మాతలు. కాస్తయినా తేరుకోవాలంటే భారీ రిలీజ్ అవసరం. అందుకే ఆంధ్రాలో వాళ్ల దగ్గరున్న థియేటర్లలో పాటు నైజాం, సీడెడ్ లో ఎక్కువ థియేటర్ల కోసం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాగ్జిమమ్ థియేటర్ల నుంచి రంగులరాట్నం ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి.

అటు ఆచారి అమెరికా యాత్ర సినిమా కోసం కూడా ఉన్నంతలో మంచి థియేటర్ల కోసం చూస్తున్నారు. పద్మజ పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాతల మధ్య ఇప్పటికే కుదిరిన లోపాయికారి ఒప్పందం ప్రకారం గ్యాంగ్ సినిమాను రీప్లేస్ చేసే పరిస్థితి లేదు. సో.. వీళ్లకు కూడా రంగులరాట్నం థియేటర్లే కావాలి. సో.. రాబోయే శుక్రవారానికి రంగులరాట్నం సినిమా దాదాపు తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంటుంది.