సినిమాలు నిర్మించడం కన్నా విడుదల చేయడం కష్టం అన్నది టాలీవుడ్ లో కఠోర సత్యం. సరైన స్లాట్ దొరకడం అన్నది గగనం అయిపోయింది. కష్టపడి, వెదికి వెదికి స్టాట్ పట్టుకున్నా, టక టకా బోలెడు సినిమాలు వచ్చి మీద పడిపోతున్నాయి. దాంతో థియేటర్ల సమస్య. ఓపెనింగ్ సమస్య. దాంతో గట్టిగా ఫైట్ ఇవ్వలేం అనుకున్న సినిమాలు వెనక్కు, వెనక్కు జరుగుతూ ఎక్కడో ఏదో వీక్ స్లాట్ లో సెటిల్ అవ్వడం అన్నది కామన్ అయిపోయింది.
26న విడుదల అవ్వాలని ఫిక్స్ అయ్యాయి విశాల్ ‘అభిమన్యుడు’, సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ సినిమాలు. కానీ ఏమయింది సరిపడా థియేటర్లు కరువే. ఓపెనింగ్స్ వస్తాయన్న ధైర్యమూ కరువే. పైగా అభిమన్యుడు సినిమాకు తమిళ లింక్ లు సెట్ కావాలి. ఇక ఘట్టమనేని వారి అమ్మాయి మంజుల ఓన్ ప్రొడక్షన్ మనసుకునచ్చిందిలో హీరో సందీప్ కిషన్. సరైన హిట్ కోసం చూస్తున్నాడు. అలాంటపుడు కాస్త జాగ్రత్త తప్పదు.
ఏదైతేనేం రెండు సినిమాలు వెనక్క వెళ్లిపోయాయి. మనసుకు నచ్చింది సినిమా ఫిబ్రవరి సెకెండ్ వీక్ లో వచ్చే అవకాశం వుంది. సరే ఎలాగూ గ్యాప్ దొరికింది కదా అని సందీప్ అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ ఫ్యాన్స్ ను మీటయ్యే పని పెట్టుకున్నాడు. అలాగే అభిమన్యుడు కూడా ఫిబ్రవరి సెకెండ్ వీక్ కే జంప్ అయింది. అక్కడ మళ్లీ ఏం సినిమాలు వచ్చి పడతాయో చూడాలి.