Advertisement


Home > Movies - Movie Gossip
శరత్ మరార్ గేమ్ షో

ఎక్కడ నుంచి వచ్చారో మళ్లీ అక్కడికే చేరారు నిర్మాత, పవన్ కళ్యాణ్ మాజీ సహచరుడు శరత్ మరార్. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు తరువాత ఆయన సినిమా నిర్మాణానికి దూరం కాలేదు కానీ, టీవీకి దగ్గరయ్యారు.

ఒక పక్క డబ్బింగ్ సినిమాల మీద దృష్టి పెడుతూనే, మరోపక్క టీవీలకు ప్రోగ్రామ్ లు అందించే పనిలో పడ్డారు. శరత్ కు ఇటు తెలుగు చానెళ్లతోనూ, అటు ముంబాయి కంపెనీలతోనూ మంచి సంబంధాలు వున్నాయి. వాటిని వాడుతూ, ఈ కంపెనీలు, ఆ చానెళ్లకు రూపొందించే కంటెంట్ కు భాగస్వామిగా వుండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారి ఆయన విఐయు కంపెనీ కోసం ‘టాలీవుడ్ స్క్వేర్స్’ అనే గేమ్ షో ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి నవదీప్ హొస్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ గేమ్ షో కు హాలీవుడ్ స్క్వేర్స్ అనే గేమ్ షో ఇన్సిపిరేషన్. ఈ గేమ్ షో లో 9మంది సినిమా సెలబ్రిటీలు పాల్గొంటారు. ఈ గేమ్ షో స్టార్ లో త్వరలో ప్రసారం అవుతుంది.

ఇదిలా వుంటే, మరి కొన్ని తెలుగు పాపులర్ చానెళ్ల కోసం కొన్ని కార్యక్రమాలు, అలాగే వెబ్ సిరీస్ లు రూపొందించే బిజీలో వున్నారు శరత్ మరార్. ఎప్పుడయితే టీవీ రంగంలో అపార అనుభవం వున్న శరత్ ఇప్పుడు మళ్లీ ఆ రంగంపై దృష్టి పెట్టారని తెలిసిందో, ఆయనకు ఆహ్వానాలు బాగానే అందుతున్నాయి.