రాజు-మంత్రి వెనక్కి?

ఎప్పుడు లేనంత టఫ్ పోటీ వచ్చింది పంద్రాగస్టు వారానికి. ఈసారి ఆగస్టు 11 న మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇది పెద్ది ఇబ్బందికర పరిస్థితిగా మారింది. Advertisement మూడు పెద్ద సినిమాలు ఒకేసారి…

ఎప్పుడు లేనంత టఫ్ పోటీ వచ్చింది పంద్రాగస్టు వారానికి. ఈసారి ఆగస్టు 11 న మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇది పెద్ది ఇబ్బందికర పరిస్థితిగా మారింది.

మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలయితే మూడింటి నిర్మాతలకు నష్టమే. కానీ ఎవ్వరూ వెనక్కు తగ్గడంలేదు. మూడు సినిమాలకు చిత్రమైన ముడిపడడమే ఇందుకు కారణం.

లై సినిమాకు హీరో నితిన్. అతని తండ్రి సుధాకరరెడ్డి కూడా నిర్మాత, పంపిణీదారుడు. అలాగే నేనే రాజు నేనే మంత్రి హీరో రానా. ఆయన తండ్రి సురేష్ బాబు కూడా నిర్మాత, పంపిణీ దారుడు. ఇక జయ జానకీ నాయక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకోండ సురేష్ కూడా నిర్మాత.

ఇలా మూడు సినిమాలకు నిర్మాతలు, హీరోలతో పాటు, తెరవెనుక హీరోల తండ్రులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. దాంతో ఏ సినిమా కూడా వెనక్క తగ్గే అవకాశం కనిపించడం లేదు.

ఇప్పటికే రెండు రోజుల క్రితం ఓ సిటింగ్ వేసారు. కానీ ఫలితం నో? మళ్లీ బుధవారం రాత్రి మరో సిటింగ్ వేసారు. అయినా విషయం తెగలేదు. ఒక దశలో సురేష్ బాబు తన కుమారుడు రానా సినిమాను 18కి వాయిదా వేసుకోవడానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. 11న తమిళనాడులో విఐపి 2 విడుదలవుతోంది. 

రానా నేనే రాజు నేనే మంత్రిని తమిళ నాట కూడా భారీగా విడుదల చేయాలని సన్నాహాలు చేసారు. అది కూడా స్వంత విడుదల. అలాంటపుడు వీఐపీ 2 వస్తే, రానా సినిమాకు కష్టం అవుతుంది. అందువల్ల 18కి వెళ్లాలని సురేష్ బాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే 18 నాటికి కీలకమైన కొన్ని థియేటర్లు ఖాళీ చేసి తమకు ఇవ్వాలని సురేష్ బాబు మిగిలిన ఇద్దరు నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ మళ్లీ ముడి బిగుసుకుంది. గురువారానికి మీటింగ్ వాయిదా పడింది.

మొత్తంమీద నేనే రాజు నేనే మంత్రి వాయిదా పడే అవకాశం వుంది. మిగిలిన రెండూ మాత్రం వాయిదా పడవని తేలిపోయినట్లే.