స్పైడర్ ఓవర్ సీస్ 15.5 కోట్లు

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ అమ్మకం దాదాపు ఫినిష్ అయింది. అగ్రిమెంట్, అనుకున్న మొత్తం చేతులు మారడం మాత్రం మిగిలి…

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ అమ్మకం దాదాపు ఫినిష్ అయింది. అగ్రిమెంట్, అనుకున్న మొత్తం చేతులు మారడం మాత్రం మిగిలి వుంది. 15.5 కోట్లకు కేవలం యుఎస్ థియేటర్ రైట్స్ మాత్రం ఇస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంత భారీ మొత్తానికి హక్కులు ఇవ్వడం వెనుక కుదిరిన అగ్రిమెంట్ ఏమిటన్నది క్లియర్ గా తెలియడం లేదు. అన్ని సినిమాల మాదిరిగానే రెగ్యులర్ టర్మ్ మీదనే ఇచ్చామని, అదనంగా కొత్త నియమాలేవీ లేవని యూనిట్ వర్గాల బోగట్టా. 

ఇదిలా వుంటే రెస్టాఫ్ ది వరల్డ్ రైట్స్ ద్వారా మరో ఎనిమిది కోట్లకు పైగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, నైజాం, తమిళనాడు హక్కులు మంచి రేట్లకు ఇచ్చేసారు. సీడెడ్ మాత్రం నిర్మాత ఎన్ వి ప్రసాద్ పంపిణీ చేసుకుంటున్నారు. తమిళ వెర్షన్ ను థియేటర్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి 23 కోట్లకు ఇచ్చినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ నటించిన స్పైడర్ సినిమా దసరా సీజన్ లో సెప్టెంబర్ 27న విడుదలకు రెడీ అవుతోంది.