ముగ్గురి ఆశల నక్షత్రం

నక్షత్రం సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది. దర్శకుడు కృష్ణవంశీ మళ్లీ తన స్టయిల్ ఎమోషనల్ సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తూనే వుంది. నిజానికి ఆయన ఈ సిందూరం నుంచే ఈ…

నక్షత్రం సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది. దర్శకుడు కృష్ణవంశీ మళ్లీ తన స్టయిల్ ఎమోషనల్ సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తూనే వుంది. నిజానికి ఆయన ఈ సిందూరం నుంచే ఈ హ్యాూమన్ ఎమోషన్లను నమ్ముకోవడం ప్రారంభించారు. పైగా తొలి సినిమా నుంచి అలవాటైన హీరోయిన్ గ్లామర్ ప్రదర్శన వుండనే వుంది.

ఈసారి నక్షత్రం సినిమాలో రెండింటినీ నమ్ముకుంటున్నారు. కథను భారీ భావోద్వేగాల కోసం తయారుచేసుకున్నా, అందులో అమ్మాయిల అందాల ఆరబోతను బోలెడు చేర్చేసాడు. వదుల్తున్న స్టిల్స్, వాటిల్లో రెజీనా రెచ్చిపోయిన తీరు చూస్తుంటే, ఆమెను కృష్ణవంశీ ఓ రేంజ్ లో వాడేసుకున్నట్లు కనిపిస్తోంది. హీరోయిన్ సహకరించాలే కానీ కృష్ణవంశీ పిండగలిగినంత గ్లామర్ పిండేస్తాడు. ఇప్పుడు అదే చేసాడు. పైగా రెజీనాకు సరైన సినిమా కావాలి. అందుకోసం ఆమె యథాశక్తి సహకరించేసింది.

ఇక సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు సందీప్ కిషన్. సో, అతగాడు కూడా ఎలా చేయమంటే అలాచేసేసాడు. సో, ఈ సినిమాలో అటు రెజీనా, ఇటు సందీప్ ల కష్టం కిట్టుబాటు కావాల్సి వుంది. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ కూడా వుంది. జవాన్ సినిమా విడుదలకు మూడు వారాల ముందుగా వస్తోంది నక్షత్రం. ఇందులో నలభై నిమషాల పాటు కనిపిస్తాడు సాయిధరమ్ తేజ. ఈ సినిమాలో పాత్ర ఏ మాత్రం క్లిక్ అయినా అది తన జవాన్ కు కలిసి వస్తుంది. చూడాలి. ముగ్గురి ఆశలు ఏమవుతాయో?