మహిళల్ని రేప్ చేయడం కామన్. రివర్స్ లో మగాళ్లనే రేప్ చేయడం లేటెస్ట్ ఫ్యాషన్. బ్రిటన్ లో అమ్మాయిలు మరీ శృతిమించిపోతున్నారు. తమ కామ వాంఛ తీర్చాల్సిందిగా పురుషుల్ని బెదిరిస్తున్నారు. అవసరమైతే పురుషుడిపై తుపాకి గురిపెట్టి మరీ తమ సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నారు. రోజురోజుకు ఇలాంటి కేసుల సంఖ్య అక్కడ పెరిగిపోతోంది. లాన్సెస్టర్ యూనివర్సిటీ లా స్కూల్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.
సర్వేలో 154 మంది పురుషులు తమపై లైంగిక దాడి జరిగిందని ఒప్పుకున్నారు. ఆయుధాలతో భయపెట్టి లేదా బ్లాక్ మెయిల్ చేసి తమను బలవంతంగా సెక్స్ లోకి లాగారని వీళ్లు ఆరోపిస్తున్నారు. తమపై అబద్ధాలు కల్పించడం, భాగస్వామితో బాంధవ్యాన్ని తుంచేస్తామని బెదిరించడం, పుకార్లు సృష్టించడం, బూతులు తిట్టడం ద్వారా తమతో బలవంతంగా కొందరు యువతులు సెక్స్ చేయించుకున్నారని 22శాతం మంది పురుషులు సర్వేలో వెల్లడించారు.
బ్రిటన్ లో ఈ తరహా సర్వే నిర్వహించడం తొలిసారి కాగా, మొదటి ప్రయత్నంలోనే ఇంతమంది పురుషులు తమ గోడును చెప్పుకోవడం ఆ దేశ అధికారుల్ని ఆలోచింపజేస్తోంది. అయితే సర్వే కంటే ముందే నిపుణులు ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. ప్రతి 21 మంది పురుషుల్లో ఒకడు ఇలాంటి వేధింపులకు గురవుతున్నాడని వాళ్లు అంటున్నారు.
మహిళల కోసం బలంగా చట్టాలు రూపొందించిన బ్రిటన్ ప్రభుత్వం, పురుషులపై లైంగిక దాడికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చట్టాలు చేయలేదు. అందుకే ఇలాంటి కేసుల్లో గాయాల పాలైన పురుషులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడంలేదు.