పెళ్లి తర్వాత తొలి తెలుగు సినిమా?

నితిన్, కీర్తి సురేష్ ఇంతకుముందు రంగ్ దే సినిమా చేశారు. ఇప్పుడు ఎల్లమ్మతో మరోసారి కలవబోతున్నారు.

2023 తర్వాత తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది కీర్తి సురేష్. అంటే దాదాపు రెండేళ్లు అయిపోయింది. ఈ గ్యాప్ లో ఆమె పెళ్లి కూడా చేసుకుంది. సో.. ఇక ఆమె మెల్లగా టాలీవుడ్ కు దూరమౌతుందని అంతా అనుకున్నారు.

అయితే తెలుగులో సినిమాలు తగ్గించింది కానీ కెరీర్ ఆపలేదు కీర్తిసురేష్. తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఆమె నితిన్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సాయిపల్లవిని అనుకున్నారు. కానీ హిందీ రామాయణ్ వల్ల బిజీగా ఉన్న సాయిపల్లవి, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం కీర్తిసురేష్ ను వరించింది.

నితిన్, కీర్తి సురేష్ ఇంతకుముందు రంగ్ దే సినిమా చేశారు. ఇప్పుడు ఎల్లమ్మతో మరోసారి కలవబోతున్నారు. ఈ సినిమా తన కెరీర్ కు గేమ్ ఛేంజర్ అవుతుందని పదేపదే చెబుతున్నాడు నితిన్.

2 Replies to “పెళ్లి తర్వాత తొలి తెలుగు సినిమా?”

Comments are closed.