తమన్నా కీలకపాత్రలో తయారవుతున్న సినిమా ఓదెల 2. సీక్వెల్ గా స్టార్ట్ అయిన పాన్ ఇండియా రిలీజ్ కు ఎయిమ్‌గా చేస్తున్న సినిమా. టీజర్ విడుదల వరకు ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి లేదు. టీజర్ వచ్చిన తరువాత అందరి దృష్టి అటు మళ్లింది.
ఓటిటి నుంచి 11.50 కోట్ల ఆఫర్ అందుకోవడం, హిందీ వెర్షన్ ను ఆరు కోట్లకు అమ్మడంతో క్రేజ్ అర్థం అయింది. కానీ అంత మాత్రం చేత అయిపోలేదు. ఇంకా చాలా వుంది వ్యవహారం. ఎందుకంటే సినిమా థియేటర్ లాండింగ్ కాస్ట్ 30 కోట్లు. అంటే ఇంకా 12 నుంచి 13 కోట్లు రికవరీ కావాలి.
తమిళ, కన్నడ, మలయాళ థియేటర్ వెర్షన్లు, సౌత్ ఇండియా శాటిలైట్ అన్నీ కలిపి తొమ్మిది నుంచి పది కోట్ల వరకు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. ఓన్లీ శాటిలైట్ ఆరు కోట్లు వస్తే గట్టెక్కేసినట్లే. తెలుగు థియేటర్ ఫ్రీ అయిపోతుంది. అందుకే ఏప్రిల్ 17 డేట్ అంటూ పోస్టర్ వేసేసారు. ప్రస్తుతానికి అయితే ఆ డేట్ కు మరే సినిమా లేదు. సారంగపాణి జాతకం వస్తుందని అంటున్నారు కానీ ఇంకా ఓటిటి అమ్మకాలు కావాల్సి వుంది.
ఈ నేపథ్యంలో మంచి హర్రర్..ఇంటెన్సిటీ వున్న పోస్టర్ ను విడుదల చేసారు. లుక్ బాగుంది. ఇప్పుడు ఈ లుక్ కావచ్చు, వదలబోయే కంటెంట్ లు కావచ్చు. థియేటర్ బజ్ ను పెంచాల్సి వుంటుంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్స్ కాంబినేషన్ లో ఈ సినిమాను నిర్మించారు. తమన్నా, అశోక్ తేజ కీలకపాత్రలు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ammo
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,