ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగాలంటే వారు పోరాటాలు చేయాలి. ప్రభుత్వాన్ని వేడుకోవాలి. ఈ కథ వెంటనే కొలిక్కి రావడం చాలా కష్టం. ప్రభుత్వం పీఆర్సీ వేయాలి. అది నివేదిక ఇవ్వాలి. ఉద్యోగులు డిమాండ్ చేసిన స్థాయిలో జీతాలు పెరగవు. వాళ్లతో చర్చలు జరపాలి. సంప్రదింపులు జరపాలి. వాళ్లను కన్విన్స్ చేయాలి. ఈ తతంగం చాలా ఉంటుంది.
చివరకు అటు ప్రభుత్వం చెప్పింది కాకుండా, ఇటు ఉద్యోగులు డిమాండ్ చేసినంత కాకుండా ఎక్కడో ఒకచోట ఇరు పక్షాలు రాజీపడి జీతాలు పెంచుతారు. ఏ రాష్ట్రంలోనైనా కథ దాదాపు ఇలాగే ఉంటుంది. కాని చట్ట సభలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మాత్రం తమ జీతాలను చాలా సులభంగా పెంచుకుంటారు. వాళ్లేమీ పోరాటాలు చేయక్కరలేదు. ధర్నాలు చేయక్కరలేదు. ఎవరినీ బతిమిలాడుకోవల్సిన అవసరం లేదు.
అనుకున్నదే తడవుగా అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పకుంటున్నామంటే….కర్ణాటకలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి జీతాలను వంద శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఉచిత పథకాలు అమలు చేయడం భారంగా మారింది. ఆమధ్య బస్సు చార్జీలు పెంచారు. కొన్ని రోజుల కిందట మెట్రో రైలు చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీలు పెంచినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
కాని ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేల, మంత్రుల, ముఖ్యమంత్రి జీతాలు పెంచుతున్నారు. ఆల్రెడీ ఈ పెంపును అసెంబ్లీ ఆమోదించింది కూడా. ప్రజాప్రతినిధులంటే వాళ్లేమీ తిండికి గతిలేనివారు కాదు కదా. ఎవరో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ కోట్లకు పడగెత్తి ఉంటారు. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉంటాయి. ప్రజాప్రతినిధులకు సొంత వ్యాపారాలు ఉంటాయి. కాంట్రాక్టులు ఉంటాయి. ఇతర దందాలు అనేకం ఉంటాయి.
ఆదాయానికి ఏమీ తక్కువ ఉండదు కదా. అయినప్పటికీ జీతాలు వంద శాతం పెంచారు. అంటే డబుల్ చేశారన్నమాట. జీతాల పెంపునకు సీఎం సిద్దరామయ్య చెప్పిన సమాధానం ….ఖర్చలు బాగా పెరిగాయట. ప్రజాప్రతినిధులు తట్టుకోలేకపోతున్నారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి జీతం నెలకు రూ.1,50,000, మంత్రులకు రూ.1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగనుంది.
పెన్షన్లు కూడా భారీగా పెరగనున్నాయి. రూ.55,000 నుంచి రూ.95,000కు చేరుకునే అవకాశముంది. ఇదే విధంగా ప్రయాణ భత్యాలు, వైద్య, టెలిఫోన్, పోస్టల్ ఖర్చులకూ పెంపు ప్రతిపాదించారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జీతాలు భారీగా పెంచారు. పెన్షన్లు పెంచారు. జీతాల పెంపు సందర్భంగా జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ ”ఎమ్మెల్యేలకు కూడా ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వారి జీతాలను పెంచాలని నిర్ణయించాం. దీనిని మరో విధంగా చూడవద్దు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి” అని అన్నారు. జీతాలు పెంచకపోతే ప్రజాప్రతినిధులకు రోజు గడవదా? అంటే దానికి ఏం సమాధానం చెబుతాం.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Pappam
వారికి పాపం అడ్డ దారులు షెల్ కంపెనీ లు వగైరా తెలిసినట్లు లేదు.. లేకపోతే ఆరు పైసలు జీతం తీసుకొనేవారు