ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఉగాది

ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్.. ఇలా ఈ హీరోల అభిమానులంతా మరో వారం రోజుల్లో రాబోతున్న ఉగాది కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్.. ఇలా ఈ హీరోల అభిమానులంతా మరో వారం రోజుల్లో రాబోతున్న ఉగాది కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం, ఈ ఉగాదికైనా తమ హీరోల సినిమాల నుంచి అప్ డేట్స్ వస్తాయనేది వాళ్ల ఆశ.

చాన్నాళ్లుగా నలుగుతున్న స్పిరిట్ సినిమాపై ఉగాదికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉగాది రోజున ఈ సినిమా యూనిట్ నుంచి ప్రకటన వస్తుందని ఊదరగొడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇప్పటికే సెట్స్ పైకి రావాలి ఈ మూవీ. కానీ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఉగాదికి ఆ ముచ్చట తీరుతుందని ఫ్యాన్స్ ఫీలింగ్.

అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉగాది కోసం వెయిటింగ్. హరిహర వీరమల్లు సినిమాకు కొత్త విడుదల తేదీ రావడంతో, ఓజీ నుంచి ఓ ప్రకటన కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఉగాది రోజున ఓజీ టీమ్ నుంచి కొత్త విడుదల తేదీపై ఎనౌన్స్ మెంట్ ఉంటుందనే ఫీలర్లు వినిపిస్తున్నాయి.

ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. చాన్నాళ్లుగా కెమెరాకు దూరమైన అఖిల్ నుంచి ఈ ఉగాదికి కొత్త సినిమా ప్రకటన వస్తుందంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.

లిస్ట్ లో విశ్వంభర కూడా ఉంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు. అప్పట్నుంచి మెగా మూవీ విడుదలపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ వేసవిలోనే మూవీ వస్తున్నట్టు మొన్నటివరకు ప్రచారం సాగింది. కానీ జులై చివరి వారం లేదా ఆగస్ట్ కు సినిమా వెళ్లిందనేది లేటెస్ట్ టాక్. దీనిపై కూడా ఉగాదికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

3 Replies to “ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఉగాది”

Comments are closed.