బాబు అంటే భ‌యం, భ‌క్తి లేవు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి పాల‌న‌తో పాటు సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ప‌ట్టు పోయింద‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి పాల‌న‌తో పాటు సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ప‌ట్టు పోయింద‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఒక వైపు కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, అలాంటి వాళ్ల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్ అవుతున్నార‌నే వార్త‌లొస్తున్నా, ప‌రిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లి న‌ర‌సారావుపేట ఎమ్మెల్యే అర‌వింద్‌బాబు వీరంగం సృష్టిస్తే, ఆయ‌న్ను పిలిచి మంద‌లించార‌ని ప‌ది రోజుల క్రితం విన్నాం.

తాజాగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోనే రెవెన్యూ అధికారుల్ని నాన్‌స్టాప్‌గా విజ‌య‌వాడ ఎమ్మెల్యే బూతులు తిడుతుండ‌గా, సంబంధిత మంత్రి వారించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ మంత్రిగారిని కూడా స‌ద‌రు ఎమ్మెల్యే విడిచిపెట్ట‌లేదు. మంత్రిని కూడా తిట్టారు. ఇంత వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌నే మాటే లేదు. ఎందుకంటే, స‌ద‌రు ఎమ్మెల్యే కాపు సామాజిక వ‌ర్గంతో పాటు పొలిట్‌బ్యూరో స‌భ్యుడు కూడా కావ‌డంతో మంద‌లించ‌డానికి సీఎంకు భ‌యం అని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అంటున్నారు.

ఇప్పుడే ఇలా వుంటే, మ‌రో ఏడాది గ‌డిస్తే, కూటమి ప్ర‌జాప్ర‌తినిధుల్ని చంద్ర‌బాబు కంట్రోల్ చేసే ప‌రిస్థితి అస‌లే వుండ‌దు. కూట‌మి పాల‌న స‌గం పూర్తి చేసుకునే నాటికి, పూర్తిగా కంట్రోల్ త‌ప్పే ప్ర‌మాదం వుంద‌ని అంటున్నారు. ఆ రోజుకు టికెట్లు ద‌క్క‌వ‌నో, మ‌ళ్లీ అధికారంలోకి రాలేమ‌నే వాతావ‌ర‌ణం క‌నిపిస్తే, ప్ర‌జాప్ర‌తినిధులు చంద్ర‌బాబు మాట వినే ప‌రిస్థితి అస‌లు వుండ‌ద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబుకు వ‌య‌సు పైబ‌డ‌డం, ఇప్పుడు అన‌ధికారికంగా ప్ర‌భుత్వానికి, పార్టీకి నాయక‌త్వం వ‌హిస్తున్న లీడ‌ర్ ఒక కోటరీని పెట్టుకుని ఇష్టానుసారం దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు న‌మ్ముతున్నారు. చంద్ర‌బాబు మంద‌లించాల్సి వ‌స్తే, ముందు ఇంటి నుంచే ప్రారంభించాల‌ని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. పెద్దాయ‌న స‌వాల‌క్ష చెబుతుంటార‌ని, ఆయ‌న ఇంటికి చేరాల్సింది చేరుతోంద‌ని, తాము కూడా ఎన్నిక‌ల్లో పెట్టుబ‌డులు పెట్టామ‌ని, అదంతా రాబ‌ట్టుకోవాలి క‌దా అని తెగేసి చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా అధికారులెవ‌రూ త‌మ మాట విన‌డం లేద‌ని, అందుకే ర‌చ్చ చేయాల్సి వ‌స్తోంద‌ని మ‌రికొంద‌రు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అంటున్నారు. ఈ ద‌ఫా చంద్ర‌బాబు మార్క్ ప‌రిపాల‌న క‌నిపించ‌లేద‌న్న‌ది వాస్త‌వం. దానికి కార‌ణాలు అనేకం. చంద్ర‌బాబు పేరుకే సీఎం, పెత్త‌న‌మంతా మ‌రొక‌రు చెలాయిస్తుండ‌డం, ఆ కోట‌రీ అరాచ‌కాల గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌డంతో, వాటినే అధికార పార్టీ నేత‌లు ఆద‌ర్శంగా తీసుకోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఈ ప‌రిణామాలు ఎన్నిక‌ల నాటికి ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటాయో చూడాలి.

16 Replies to “బాబు అంటే భ‌యం, భ‌క్తి లేవు!”

  1. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. సర్లే చంద్రబాబు కి భయం అని నీతో అన్న ఆ టీడీపీ ప్రజా ప్రతినిధులు ఎవరో ధర్యంగా రాసే దమ్ము ఉందా ?ఫస్ట్ ఆ టీడీపీ ప్రథినిధుల పేర్లు ధైర్యం చెప్పు అప్పుడు పక్కన వాళ్ళ భయాల గురించి మాట్లాడుకుందాం..?

  3. ఫస్ట్ ఆ టీడీపీ ప్రథినిధుల పేర్లు ధైర్యం చెప్పు అప్పుడు పక్కన వాళ్ళ భయాల గురించి మాట్లాడుకుందాం

  4. 11మోహనచెడ్డీ అంటే భయము, భక్తి లేని 10 నీలి MLA లు అసెంబ్లీ కి దొ0గతనం గా వచ్చి I PoD లు ఎత్తుకెళ్లారు.. వాళ్లమీద మావోడు గుస్సా అంటా.. వాళ్ళ బట్టలూడదీసి ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది.. ద్యావుడా వాళ్ళ మానం కాపాడు..

  5. 11మోహన’చెడ్డీ అంటే భయము, భక్తి లేని 10 ‘నీలి MLA లు అసెంబ్లీ కి దొ0గతనంగా వచ్చి I PoD లు ‘ఎత్తుకెళ్లారట.. వాళ్లమీద మావోడు గుస్సా అంటా.. ‘దొరికితే వాళ్ళ బట్టలూడదీసి ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది.. ద్యావుడా వాళ్ళ మాన0 కాపాడు

  6. 11మోహన’చెడ్డీ అంటే భయము, భక్తి లేని ఆ 10 ‘నీలి ‘MLAలు అసెంబ్లీకి దొ0గతనంగా వచ్చి I PoD లు ‘ఎత్తుకెళ్లారట.. వాళ్లమీద మావోడు గుస్సా అంటా.. ‘దొరికితే వాళ్ళ ‘బట్టలూడదీసి ఏం చేస్తాడో ఏమో అని భయ0గా ఉంది.. ‘ద్యావుడా వాళ్ళ మాన0 కాపాడు

  7. 11మోహన’చెడ్డీ అంటే భయము, భక్తి ‘లేని ఆ 10 ‘నీలి ‘MLAలు అసెంబ్లీకి దొ0గతనంగా వచ్చి I PoD లు ‘ఎత్తుకెళ్లారట.. వాళ్లమీద మావోడు గుస్సా అంటా.. ‘దొరికితే వాళ్ళ ‘బట్టలూడదీసి ఏం చేస్తాడో ఏమో అని భయ0గా ఉంది.. ‘ద్యావుడా వాళ్ళ మాన0 కాపాడు

  8. అటు ఇటు తిప్పినా 11 పదకొండే కానీ అట్టే గాబర పడక చిలక ముక్కు సారు లాగ 5 ఏళ్ళు విశ్రాంతి తీసుకో

Comments are closed.