కొందరు కొందరిపై వుట్టినే ఆశలు పెట్టుకోరు. వాళ్ల దగ్గర తమకు కావాల్సింది వుందని పక్కాగా తెలిసిన తరువాత, అది తమకు పక్కాగా కావాలని అనుకున్నాకే అలాంటి ఆశలు పెంచుకుంటారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకును హీరో చేయాలని అనుకున్న తరువాత రెండో సినిమాను కచ్చితంగా డైరక్టర్ బోయపాటితో చేయించాలని డిసైడ్ అయ్యాడు.
వివి వినాయక్ తో అల్లుడు శీను నిర్మిస్తున్న టైమ్ లోనే బోయపాటికి భారీ రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసి ఫిక్స్ చేసాడు. కానీ ఆ తరువాత బెల్లంకొండ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కూడా బోయపాటిని వదల్లేదు. తన కొడుకు సాయి శ్రీనివాస్- బోయపాటి కాంబినేషన్ లో సినిమా రావాల్సిందే అని ఫిక్స్ అయ్యారు.
బోయపాటి ఒక్క సినిమా కోసం పక్కకు వెళ్లినా తరువాత సినిమా కచ్చితంగా బెల్లంకొండ హీరోతో చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బాలయ్య సినిమా కూడా వదలాల్సి వచ్చింది. మరోపక్క సినిమాను నిర్మిస్తాం అన్న అభిషేక్ పిక్చర్స్ పక్కకు తప్పుకుంది. ఇలా ఒకదానిపై ఒకటి సమస్యలు వచ్చినా బోయపాటి సినిమాను మాత్రం బెల్లంకొండ సురేష వదిలి పెట్టలేదు. మరో నిర్మాతను చూసారు. కావాల్సిన వన్నీ సమకూర్చారు. విడుదల వరకు తీసుకువచ్చారు.
ఇప్పడు సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. చూసిన వాళ్లకు అర్థం అయింది బెల్లంకొండ ఎందుకు బోయపాటి కోసం అంత పట్టుపట్టారో? మాస్ జనాలకు నప్పాలి బడా హీరో కావాలంటే. ఓపెనింగ్స్ సాధించాలంటే. అందుకు కావాల్సిన విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ ను బోయపాటి మౌల్డ్ చేసినట్లు కనిపిస్తోంది. ట్రయిలర్ లో శ్రీనివాస్ మాంచి మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. కథ, కథనాలు, బోయపాటి తరహాలోనే వున్నాయి. మొత్తానికి బెల్లంకొండ తాను అనుకున్నది సాధించాడు. పిల్లల్ని హీరోలను చేయాలంటే ఆ మాత్రం తెగింపు, పట్టుదల వుండాలి. ఆపై పిల్లల అదృష్టం.