మ‌ల‌యాళీ ఆఫీస‌ర్.. కాస్త డోస్ ఎక్కువైంది కానీ!

మొత్తం మూడు చైన్లు తో ఈ క‌థ పెన‌వేసుకుని.. అనేక మంది జీవితాల్లో చీక‌టిని నింపుతూ సాగుతుంది.

గుక్క తిప్పుకోకుండా మిస్ట‌రీ, క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ సినిమాల‌ను వ‌దిలే మ‌ల‌యాళీలు గత వారంలో ఓటీటీకి పొన్ మాన్ వంటి సినిమాను ఇచ్చారు. కిష్కింద‌కాండం, సూక్ష్మ‌ద‌ర్శిని, రేఖాచిత్రం.. ఇలా వ‌ర‌స పెట్టి ఇన్వెస్టిగేటివ్ డ్రామాల త‌ర్వాత మ‌ధ్య‌లో ప‌ని, మార్కో వంటి హై వ‌యొలెన్స్ సినిమాల త‌ర్వాత ఆ త‌ర‌హాదే మ‌రో సినిమా వ‌చ్చింది ఓటీటీలో. ఇదే ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ. ఒక‌ప్ప‌టి మ‌ల‌యాళీ ల‌వ‌ర్ బాయ్ కుంచ‌కో బొబ‌న్ సీరియ‌స్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో లీన‌మైపోయి న‌టించిన ఈ సినిమా కాస్త డోస్ ఎక్కువైన‌ట్టుగా అనిపించినా, స‌మాజంలో డ్ర‌గ్స్ పోక‌డ‌ల ఆధారంగా వ‌చ్చిన ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్.

రేఖాచిత్రం సినిమాలో ఒక రాత్రి చ‌ర్చిలో ఆశ్ర‌యం పొందిన ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ అక్క‌డ వ‌డ్డించిన భోజ‌నంలో చికెన్ వేసుకోక‌పోవ‌డంతో మొత్తం క‌థ మ‌లుపు తిరిగిన‌ట్టుగా! ఆఫీస‌ర్ లో ఒక కండ‌క్ట‌ర్, ఒక ప్ర‌యాణికురాలు, మ‌రో పోలీసాఫీస‌ర్ జీవితాల‌ను ఒక బ‌స్సు ప్ర‌యాణం అనూహ్య మ‌లుపులు తిప్పుతుంది. వారి పిల్ల‌లు ప్ర‌మాదంలో ప‌డ‌తారు. స‌రిగ్గా ఆ పిల్ల‌లే ఎందుకు టార్గెట్ అయ్యార‌నేందుకు మూల పాయింట్ బ‌స్సు ప్ర‌యాణం వ‌ద్ద క‌నెక్ట్ చేస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది.

డీవైఎస్పీ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ అయిన హ‌రికృష్ణ‌న్ స‌స్పెన్ష‌న్ త‌ర్వాత డిమోష‌న్ పొంది సీఐ స్థాయి పోస్టులో రీజాయిన్ అవుతాడు. ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్ మొహం ప‌గుల కొట్టాడ‌నే కార‌ణంతో అత‌డిని స‌స్పెండ్ చేసి ఉంటారు ఉన్న‌తాధికారులు. అయితే అది అస‌లు కార‌ణం కాదు. ఒక కేసు విచార‌ణ‌లో భాగంగా ఇత‌డు వ్య‌హ‌రించిన తీరు ఆ స‌స్పెన్ష‌న్ కు కార‌ణం అయి ఉంటుంది. తిరిగి జాయిన్ కావ‌డంతోనే.. హ‌రి వ‌ద్ద‌కు ఒక కేసు వ‌స్తుంది. కాకిబంగారంతో చేసిన ఒక చెయిన్ ను తాక‌ట్టుబోయాడంటూ ఒక వ్య‌క్తిని తీసుకొస్తారు ఒక బంగారం షాపు వాళ్లు. అయితే ఆ బంగారం చైనును త‌న కూతురు కోసం త‌ను కొన్నాన‌ని, షాపు పేరు చెబుతాడు ఆ వ్య‌క్తి. ఈ పాత్ర‌లో మ‌ల‌యాళీ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌దీష్ క‌నిపిస్తాడు.

ఆ చైన్ ఎక్క‌డ కొన్నాడ‌నేదాన్ని బ‌ట్టి చూస్తే.. అత‌డు చెప్పింది నిజ‌మే. మ‌రి ఆ అస‌లు బంగారం, అదే డిజైన్ లో న‌కిలీ బంగారంగా ఎలా మారింద‌నే విష‌యంలో.. ఆ వ్య‌క్తి కూతురు ప్ర‌మేయం ఉంద‌ని హ‌రికి అర్థం అవుతుంది. ఒక చిన్న చైన్ ద‌గ్గ‌ర మొద‌లయ్యే ఈ విచార‌ణ‌.. ఆ త‌ర్వాత అనేక మ‌లుపులు తిరుగుతుంది. మొత్తం మూడు చైన్లు తో ఈ క‌థ పెన‌వేసుకుని.. అనేక మంది జీవితాల్లో చీక‌టిని నింపుతూ సాగుతుంది.

కథ మ‌లుపుల విష‌యంలో కొంత సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నా.. డ్ర‌గ్స్ వినియోగదారులు, వారి తీవ్ర‌మ‌న‌స్త‌త్వ పోక‌డ‌ల గురించి చ‌ర్చించి, స‌మాజానికి ఒక వార్నింగ్ లాంటి దాన్ని ఇస్తూ ఈ సినిమా సాగుతుంది. పిల్ల‌లు ఎలాంటి వారితో స్నేహాలు చేస్తున్నారో స‌మీక్షించుకోవాల్సిన అవ‌స‌రాన్ని టీనేజ‌ర్ల‌ను క‌లిగిన వారికి గుర్తు చేస్తుంది. స‌మాజంలో డ్ర‌గ్స్ సంబంధిత పెడ ధోర‌ణులను చూపిస్తుంది.

ప‌ని సినిమాలో ఇద్ద‌రు యువ‌కులు త‌మ హింసాత్మ‌క ధోర‌ణితో సిటీలో పేరు మోసిన డాన్ల‌కు చుక్క‌లు చూపిస్తారు. ఆ త‌ర‌హాలో శక్తియుక్తులున్న పోలీసుల‌కు ఈ సినిమాలో న‌లుగురైదుగురు డ్ర‌గ్స్ వినియోగ‌దారులైన యువ‌తీయువ‌కులు చుక్క‌లు చూపిస్తారు. ఇదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ వంటి వాటిని డీల్ చేయ‌డంలో పోలీసుల్లో ఉంటే అవ‌త‌వ‌క‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. ఎంత పెద్ద పోలీసు కూడా త‌న పిల్ల‌ల విష‌యంలో వ్య‌వ‌హ‌రించే తీరులో త‌ప్పుల‌ను చూపించారు. హీరో పాత్ర ఆవేశంతో వ్య‌వ‌హ‌రించే తీరులో త‌ప్పుల‌ను కూడా క‌థ‌లో భాగంగా చేశారు.

అయితే ప్రీ క్రైమాక్స్ పార్ట్ కాస్త ఎక్కువైన‌ట్టుగా, సాగ‌దీసిన‌ట్టుగా, ఇక ఆపండ్రోయ్ అన్న‌ట్టుగా అనిపిస్తుంది. విల‌న్ల‌పై హీరో ప్ర‌తీకార క్లైమాక్స్ కూడా అప్ప‌టి వ‌ర‌కూ వారు సాగించిన హింస‌కు త‌గిన రీతిలో ఉంటుంది. ప‌ని సినిమాలో ప్ర‌ధాన పాత్ర ఆ ఇద్ద‌రు కుర్రాళ్ల‌పై అప్ప‌టి వ‌ర‌కూ ర‌గిలిపోయిన తీరును బ‌ట్టి ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందా అని ప్రేక్ష‌కుడు ఆస‌క్తిదాయ‌కంగా చూస్తాడు. దాన్ని విప‌రీత‌మైన హింసాత్మ‌కంగా తీశాడు జోజూ జార్జ్. ఈ సినిమాలో కూడా వారిని ఆఫీస‌ర్ ఎలా అంతం చేస్తాడా అనేది ప్రేక్ష‌కుడు ఆఖ‌రి వ‌ర‌కూ ఎదురుచూసే అంశం.

ఎలాగూ ఆ పాత్ర‌ల‌ను మ‌ట్టుబెడ‌తాడు, అప్ప‌టి వ‌ర‌కూ వారు సాగించిన స్టోరీకి ఆ పాత్ర‌ల ముగింపుకూ ముడిప‌డి ఉండాలి. స‌రిగ్గా ఆ విష‌యంలో ప్రేక్ష‌కుడి ఆస‌క్తిని దృష్టిలో ఉంచుకుని సాగే క్లైమాక్స్.. కంప్లీట్ ఫీలింగ్ తో ప్రేక్ష‌కుడికి శాటిస్ ఫ్యాక్ష‌న్ ను ఇస్తుంది. ప్రీక్లైమాక్స్ లో సాగే విసుగును క్లైమాక్స్ క‌న్వీన్స్ చేస్తుంది.

ప్రియ‌మ‌ణి హీరో భార్య పాత్ర‌లో క‌నిపిస్తుంది. డ్ర‌గ్స్ అడిక్టెడ్ పాత్ర‌ల్లోని యువ‌తీయువ‌కులైతే, వారు న‌టులు, ఇదంతా సినిమా అంటే.. న‌మ్మ‌డం క‌ష్టం అనే రీతిన రెచ్చిపోయారు!

8 Replies to “మ‌ల‌యాళీ ఆఫీస‌ర్.. కాస్త డోస్ ఎక్కువైంది కానీ!”

  1. మన ఆంద్ర లో స్కూ*ళ్ల స్థా*యిలో గంజా*యి అలవాటు మాత్రం ప్యా*లస్ పుల*కేశి టైమ్ లో విప*రీతంగా పెరిగింది.

    అనేక మంది యూ*త్ జీవితం నాశ*నం అయ్యింది.

    కానీ, ప్యాల*స్ పుల*కేశి దాని వలన వచ్చిన డబ్బు*తో కులా*సాగా విమానాల్లో తిరుగుతూ వున్నాడు.

    అలా వచ్చిన డబ్బుతో ఇలాంటి వె*బ్సైట్ వా*ళ్ళకి బి*చ్చం విసి*రేసి తన గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.

  2. అప్పట్లో జ*గ్గు అనే వాడు, పవార్ అడ్డం పెట్టుకొని స్కూ*ల్స్ లో గం*జాయి సరఫరా చేసి డబ్బు సంపాదిం*చాడు, పోరం*బోకు గాడు. త*ల్లి నీ తరిమేసిన పం*ది వెధ*వ గా*డిద.

  3. మలయాళీ థ్రిల్లర్స్ లో ఉండే ఉత్సుకత దాదాపు నిల్లు

    మన సగటు తెలుగు బీ గ్రేడ్ హీరో ఓరియంటెడ్ సినిమాలాగా ఉన్నది

Comments are closed.