బాలినేనిని న‌మ్ముకుని.. మునిగిపోయాం!

బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిని న‌మ్ముకుని జ‌న‌సేన‌లో చేరిన త‌మ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై కొంద‌రు కార్పొరేట‌ర్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిని న‌మ్ముకున్నోళ్ల‌తా ల‌బోదిబోమంటున్నారు. ఇటీవ‌ల బాలినేని స‌మ‌క్షంలో వైసీపీకి చెందిన కొంత మంది ఒంగోలు కార్పొరేట‌ర్లు జ‌న‌సేన‌లో చేరారు. బాలినేని జ‌న‌సేన నాయ‌కుడిగా ఉన్న‌ప్ప‌టికీ, ఆయ‌న పెత్త‌నాన్ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ సాగ‌నివ్వ‌డం లేదు. ఒంగోలులో బాలినేని నీడ‌ను కూడా ఆయ‌న స‌హించ‌డం లేదు.

ప్ర‌స్తుతం వైసీపీకి కేవ‌లం న‌లుగురు కార్పొరేట‌ర్లు మాత్ర‌మే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జ‌నార్ద‌న్‌కు మ‌ద్ద‌తుగా 25 మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు. ఒంగోలు కార్పొరేష‌న్‌కు హ‌డ్కో నిధులు మంజూరయ్యారు. త‌న‌ను న‌మ్ముకున్న‌ ప్ర‌తి కార్పొరేట‌ర్‌కు క‌మీష‌న్ రూపంలో రూ.6 ల‌క్ష‌లు గిట్టుబాటు అయ్యేలా చేస్తాన‌ని దామ‌చ‌ర్ల హామీ ఇచ్చారు. ప్ర‌స్తుతానికి ఒక్కో కార్పొరేట‌ర్‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున ముట్ట‌చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మిగిలిన నాలుగు ల‌క్ష‌ల సొమ్మును కొన్ని రోజుల త‌ర్వాత ఇస్తామ‌ని టీడీపీ ముఖ్య‌లు హామీ ఇచ్చారు.

అయితే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిని న‌మ్ముకుని జ‌న‌సేన‌లో చేరిన త‌మ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై కొంద‌రు కార్పొరేట‌ర్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌కు అంత సీన్ లేద‌ని తెలిసి, రాజ‌కీయంగా త‌మ గొంతులు ఎందుకు కోయాల‌ని జ‌న‌సేన‌లో చేరిన కార్పొరేట‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేను న‌మ్ముకున్నోళ్లు మాత్రం ఖుషీఖుషీగా వుండ‌గా, కూట‌మిలో ఉంటూ, ప‌నులేవీ కాలేద‌నే ఆవేద‌న‌తో బాలినేని పంచ‌న ఉన్న వాళ్లంతా మ‌ద‌న‌ప‌డుతున్నారు.

ఈ మాత్రందానికి వైసీపీలోనే వుంటే స‌రిపోయేదేమో అనే అంత‌ర్మ‌థ‌నం వాళ్ల‌లో సాగుతోంది. అయితే వైసీపీ ముఖ్య నాయ‌కులు పార్టీని కాపాడుకోవాల‌నే త‌ప‌న లేక‌పోవ‌డంతోనే అటు వెళ్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

8 Replies to “బాలినేనిని న‌మ్ముకుని.. మునిగిపోయాం!”

  1. ఏమిటో ఎంత గౌరవం ఇచ్చిన బాలినేని వీసా రెడ్డి మర్రి జంగా విజయమ్మ షర్మిల సునీత ఇలా అందరు అన్న ని వదిలి వెళ్లిపోతున్నారు…

  2. “ఈ మాత్రందానికి వైసీపీలోనే వుంటే స‌రిపోయేదేమో”…lol..any andhra person with minimum dignity will not be in ycheap…

  3. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

    ప్రస్తుతం నువ్వు ఎంత గ**** చించుకున్న ఒరిగేది ఏమీ లేదురా. నీలాంటి లఫూట్ గాళ్ళు ల పూట రాతలు రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు రా .

    శతకోటి లింగాలలో నువ్వు ఒక బోడి లింగాన్ని మాత్రమే. పిల్లి శాపానార్థాలకు ఓట్లు తెగుతాయి రా గాడిద.

Comments are closed.