ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోనే మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆయాలు నిర్మిస్తామని, ఇందుకోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వాస్తవంగా ఆలయాల నిర్మాణం కోసం టీటీడీ ఇప్పటికే ‘శ్రీవాణి’ ట్రస్టు నిర్వహిస్తోంది. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఆలయాలు నిర్మించారు. శ్రీవాణి వుండగానే మరో ట్రస్టు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించడం శ్రీవారి భక్తులకు విస్మయం కలిగిస్తోంది. ఇది మోసగించే ప్రకటనగా భక్తులు భావిస్తున్నారు.
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్టును ప్రారంభించారు. అయితే ఈ ట్రస్టుకు పెద్దగా స్పందన లభించలేదు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక, ధర్మారెడ్డి అదనపు ఈవోగా తిరుమలకు వచ్చారు. ఆయన శ్రీవాణి ట్రస్టుకు కొత్త హంగులు అద్దారు. ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళంగా ఇచ్చిన వారికి రూ.500 ప్రత్యేక దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ తాజా నిర్ణయంతో శ్రీవాణికి విశేషమైన ఆదరణ లభించింది. రోజుకు వెయ్యి టికెట్లు విక్రయించారు. దీనిద్వారా రోజుకు కోటి రూపాయలు శ్రీవారిణి ట్రస్టుకు సమకూరుతూ వచ్చింది. ఈ విధంగా వేల కోట్లు ట్రస్టులో వచ్చిపడ్డాయి. ఈ నిధులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మూడు వేల ఆలయాల నిర్మాణం చేపట్టారు. భారత దేశ చరిత్రలో ఏ ఆలయమూ ఇన్ని ఆలయాలు నిర్మించిన దాఖలాలు లేవు.
ఇటువంటి శ్రీవాణి ట్రస్టుపై అప్పట్లో ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ కల్యాణ్ దుష్ప్రచారం మొదలుపెట్టారు. శ్రీవారి ట్రస్టుకు వచ్చే డబ్బులు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయంటూ ఆరోపించారు. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదే పల్లవి అందుకుంది. తెలుగుదేశం అధికారంలోకి రాగానే శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తారని కూడా ఆ మీడియా ప్రచారం చేసింది.
కూటమి అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో విజిలెన్స్ అధికారులు టీటీడీలో విచారణ చేపట్టారు. బూతద్దం పట్టుకుని రోజుల తరబడి పరిశీలించినా శ్రీవాణిలో చిన్న అక్రమాన్ని బయటపెట్టలేకపోయారు. అదే విధంగా టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పేరు ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీఆర్ నాయుడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి, శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ప్రకటించారు.
శ్రీవాణికి సంబంధించి పైసా కూడా బయటకు వెళ్లలేదని టీటీడీ ఉన్నతాధికారులకు అతి కొద్దికాలంలోనే అర్థమయింది. అయినా ఈ ట్రస్టుపై టీటీడీ ఛైర్మన్‌తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విమర్శల నేపథ్యంలో ఏమి చేయాలో అధికారులకు పాలుపోలేదు. శ్రీవాణిని రద్దు చేస్తే రోజూ వచ్చే కోటి రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. అదే విధంగా ఆ నిధులను జనరల్ ఫండ్‌లో వేస్తే, ఏటా ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.60 కోట్లు చెల్లించాల్సి వుంటుంది. దీంతో శ్రీవాణి రద్దు చేయడం సాధ్యం కాదని టీటీడీ ఉన్నతాధికారులు పాలక మండలికి, ప్రభుత్వ పెద్దలకు తేల్చి చెప్పేశారు. ఇదంతా తెలిశాక కూడా ప్రభుత్వ పెద్దల్లో శ్రీవాణిపై పశ్చాత్తాపం లేదు. శ్రీవాణి అక్రమాలు ఏమీ జరగలదేని బహిరంగంగా ప్రకటించలేకపోయారు.
తాము చేసిన దుష్ప్రచారం భక్తులకు తెలిసిపోతుందన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వుంది. అందుకే శ్రీవాణి రద్దు చేయకుండానే, ఆలయాల నిర్మాణానికి కొత్త ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే డబ్బులనూ ఈ కొత్త ట్రస్టులోకి బదిలీ చేస్తారట! శ్రీవాణి అంతా బాగానే వుంటే మళ్లీ కొత్తగా మరో ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది?
తిరుమలలో రాజకీయాలు చేయకూడదని, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయకూడదని నిత్యం చెప్పే చంద్రబాబు… శ్రీవాణిపై చేసిన దుష్ప్రచారంపైన ఎందుకు సమాధానం చెప్పలేదు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. శ్రీవాణి ట్రస్టులో ఏదో జరిగిందన్న అపోహను భక్తుల్లో కల్పించడానికే కొత్త ట్రస్టు ప్రారంభిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెబుతూనే తిరుమల కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. కొత్త ట్రస్టు ప్రారంభించే ముందు శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తన ప్రచారంతో భక్తులు మోసం చేయగలరేమోగానీ…శ్రీవారిని మోసం చేయగలరా?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
“శ్రీ వాణి” ట్రస్ట్ ని “శ్రీరెడ్డి కి బినామీ”గా మార్చిన A1 lanjకొడుకు..దీనిద్వారా సుబ్బిగానికి, శ్రీచెడ్డీ &నగరి పిర్రల పందికి” కొన్ని వేల కోట్లు దోచి పెట్టపెట్టాడు
Meeku istamina party adhikaram lo undi. 5 years happy ga family tho kalisi santoshanga undandi. E govt tho edina sayam protsahaka roopam lo andithe teesukuni business men ga yedagandi.
Purugulu patti chastaru yellow and psycho fellows