పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్‌ల సినిమా మొదలై చాలా కాలమవుతోంది. పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని, ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్డ్గా సెట్స్ మీదకి వెళ్లాడు. ఆగస్టు 11కే విడుదల అవుతుందని సినిమా మొదలైనపుడు అనుకున్నారు. తర్వాత అది దసరాకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తే గొప్పేనంటున్నారు.
ఇంతవరకు యాభై శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదనేది ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి పవన్ నుంచి కోపరేషన్ పూర్తిగా లేదట. అతని వల్ల చాలా షెడ్యూల్స్ దెబ్బ తిన్నాయని, కాంబినేషన్ సీన్లు కూడా అనుకున్న టైమ్‌కి తీయలేకపోయామని, బిజీ ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ చేయడం తలకి మించిన భారమవుతోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
పవన్ రాజకీయ పనులతో బిజీగా లేనప్పటికీ, షూటింగ్‌కి ఎక్కువ సమయం కేటాయించడం లేదని, డెడికేషన్‌తో పని చేయడం లేదని, తన ప్లాన్ అప్సెట్ అయినప్పటికీ సినిమాపై ఎన్నో కోట్లు ఆధార పడి వుండడంతో త్రివిక్రమ్ కూల్ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అక్టోబర్‌లోనే ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఫిబ్రవరికి గానీ ఆ చిత్రాన్ని మొదలు పెట్టేలా లేడు.