స్టార్ డమ్ అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు సినిమా వసూళ్ల వరకు ఆగాల్సిన పనిలేదు. విడుదలకు ముందే ఆ సినిమాలో నటిస్తున్న హీరో మార్కెట్ వాల్యూ ఎంతనేది తెలిసిపోతుంది. దీనికి కారణం శాటిలైట్ రైట్స్. ఏమాత్రం క్రేజ్ ఉన్నా శాటిలైట్ రైట్స్ ఈజీగా అమ్ముడుపోతాయి. కానీ ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ మాత్రం చెప్పుకోలేనంత ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. ఏ మెగా హీరోకు రాని కష్టాన్ని అనుభవిస్తున్నాడు తేజు.
జవాన్ అనే సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. కానీ ఇంతవరకు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. గతంలో తేజు నటించిన విన్నర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకంటే ముందొచ్చిన తిక్క కూడా డిజాస్టర్ గా మిగిలింది.
విన్నర్ శాటిలైట్ రైట్స్ ను కిందామీద పడి అయినకాడికి అమ్మేశారు. కానీ ఇప్పుడు జవాన్ ను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తేజూకు వరుసగా ఫ్లాపులు పడడం, కొత్త దర్శకుడు కావడంతో జవాన్ సినిమా గురించి అస్సలు ఏ ఛానెల్ ఆలోచించడం లేదు. చూస్తుంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా విడుదలైన తర్వాత ఎంతో కొంతకు అమ్ముడుపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటివరకు మెగా హీరోలు ఎవరికీ ఈ పరిస్థితి రాలేదు. పవన్ సినిమాలైతే టైటిల్ కూడా ఫిక్స్ చేయకముందే శాటిలైట్ పూర్తిచేసుకుంటాయి. రామ్ చరణ్, బన్నీ సినిమాలు కూడా రిలీజ్ కు ముందే డీల్స్ పూర్తిచేసుకుంటాయి. చివరికి వరుణ్ తేజ్, అల్లు శిరీష్ సినిమాలు కూడా అమ్ముడుపోతున్నాయి కానీ పాపం సాయిధరమ్ తేజ్ కే చెప్పుకోలేని కష్టమొచ్చి పడింది.