ఇంటర్ నేషనల్ కంపెనీలు, వాటి కాంట్రాక్టులు, ఓ పద్దతిగా వుంటాయి. పేమెంట్లు ఎంత బాగా వుంటాయో, రూల్స్ కూడా అలాగే వుంటాయి. బిగ్ బాస్ షో ఒప్పుకున్నపుడు తెలియదు, మన సినిమా జనాలకు, అది ఎలా టర్న్ తీసుకుంటుందో. సరే, మంచి పేమెంట్ వస్తోంది కదా అని టైమ్ కుదిరిన వాళ్లు ఓకె అన్నారు. కానీ తీరా అక్కడకు వెళ్లాక తెలుస్తోంది సమస్య. దాని కాన్సెప్ట్.
కానీ అగ్రిమెంట్ తీవ్రత వేరుగా వుంటుంది. ఇలాంటి సమస్యలు వస్తాయని షో నిర్వాహకులకు తెలుసు. అందుకే వాళ్లు పకడ్బందీ అగ్రిమెంట్లు చేయించుకుంటారు. సంపూ కూడా అలాగే అగ్రిమెంట్ మీద సంతకం చేసి వచ్చాడు. కానీ తనను ఎలాగూ ఎలిమినేట్ చేస్తారని, తనే వెళ్లిపోతా అని కిందామీదా అయిపోయాడు. ఆ దశలో పానిక్ అయ్యాడు కూడా. కానీ బిగ్ బాస్ మాత్రం తనంతట తనని పంపే అవకాశం లేదని చెప్పడంతో, బయటకు వెళ్లడానికి మరింత పానిక్ గా బిహేవ్ చేయడమే మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
దీంతో సంపూను బయటకు పంపక తప్పడంలేదు నిర్వాహకులకు. కానీ దీనివల్ల సంపూకి లీగల్ సమస్యలు రావచ్చని, అగ్రిమెంట్ ను ఉల్లంఘించినందుకు పెనాల్టీ చెల్లించాల్సి వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కలుగ చేసుకుని, నిర్వాహకులకు సర్దిచెబితే ఏమోకానీ, లేదంటే సంపూకి సమస్యలు తప్పకపోవచ్చు