మీడియా మీద ఏడుపు ఎందుకు?

పూరి మంచోడు. చాలా మంచోడు. ఆ మాటకు వస్తే సినిమా జనాలు అందరూ మంచోళ్లు. ఇప్పుడు ఇదే సినిమా జనాల పాట.. పల్లవీనూ. సినిమా జనాల జీవితాలు అద్దాల మేడలు అంటారు. Advertisement వాళ్లకు…

పూరి మంచోడు. చాలా మంచోడు. ఆ మాటకు వస్తే సినిమా జనాలు అందరూ మంచోళ్లు. ఇప్పుడు ఇదే సినిమా జనాల పాట.. పల్లవీనూ. సినిమా జనాల జీవితాలు అద్దాల మేడలు అంటారు.

వాళ్లకు ఫ్యామిలీలు వుంటాయంటారు. వాళ్లు బాధపడతారు అంటారు. పూరి అసలు ఇలాంటివి లెక్కచేయడు. ఎవర్నీ ఖాతరు చేయడు అంటారో ఇంకొకరు.

ఇంకా మాట్లాడితే ‘గ్లోబెల్ ప్రచారాగాళ్ల నోళ్లో పూరి ఉచ్చపోస్తాడు’ అంటూరు ఇంకొకరు. 

ఇవ్వాల్టి వార్త రేపటికి అశుద్ధం అంటారు ఇంకొకరు.

రేపటికి అశుద్ధంగా మారుతుందని తెలిసీ ఇవ్వాళ అన్నం తినకుండా వుండలేమని గమనించరు. 

ఇంతకీ వీళ్ల బాధంతా చివరకు ఎక్కడికి చేరుతోంది అంటే, మీడియా మీదకే. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీడియా మీదకే.

‘పనీ పాటలేని బాడాకావ్ లంతా పని గట్టుకుని కోడిగుడ్డు మీద ఈకలు పీక్కుంట,… మీడియా వాళ్ళు సొల్లు ముచ్చట్లు రాత్తుంటే… సిట్ కు లేని ఆత్రం మీకెందుకురా షిట్ నా కొడుకుల్లారా'' అని రాసాడు ఓ సినిమా కవి. పాపం, ఒక్క మీడియాకు కూడా 'సొల్లు ముచ్చట' పట్టలేదు.

ఆ మధ్య ఎవరో వాట్సప్లో ఓ మెసేజ్ పంపారు అందులో..

డ్రగ్ రాకెట్ ను మీడియా వెలికి తీసిందా? ఎక్సయిజ్ శాఖ కెల్విన్ ను అరెస్ట్ చేయడంతో కదా ఇది ప్రారంభమైంది?

అసలు కెల్విన్ అనేవాడు సినిమా వాళ్ల పేర్లు ఎందుకు చెప్పాడు? అసలు ఆ విషయం వాడిని ముందు సినిమా జనాలు ఎందుకు అడగరు?

సినిమా వాళ్లకు మీడియా నోటీసులు ఇచ్చిందా? సిట్ నుంచి వచ్చాయా?

విచారణకు వెళ్లి వచ్చి సిట్ వాళ్లు బాగా చూసారని సర్టిఫికెట్ ఇస్తారు. మీడియాను మాత్రం తిడతారు

మీడియా జనాలు సినిమా వాళ్లతో ప్రెండ్లీగా వున్నంత మాత్రాన, కీలకమైన కేసు వచ్చినపుడు వాళ్ల డ్యూటీ వాళ్లు చేయకూడదా?

ఇండస్ట్రీలో వేలాది మంది బతుకుతుంటే, ఈ పది పన్నెండు మంది మాత్రమే మీడియాలోకి ఎందుకు రావాల్సి వచ్చింది?

ఎక్కడ అతి జరుగుతోంది?

మీడియా అంటే కేవలం అక్కడ కనిపించింది రాసి, చేతులు దులుపుకోవాలని వీళ్లందరి ఉద్దేశం అయి వుంటుంది. కానీ మీడియా వాళ్లకు వున్న పరిచయాలు ఉపయోగించి, విషయాలు సేకరించి, అందించడం కూడా జరుగుతుందని అంగీకరించరు. ఇప్పుడు మీడియా రాస్తున్న ఊహాజనిత వార్తలు రేపు నిజమే అయితే, అప్పుడు ఈ 'షిట్' రాతలు అన్నీ ఏం చేస్తారు?

కేవలం విషయసేకరణతోనే ఇంతమందిని అరెస్టు చేసిన, సిట్ సినిమా వాళ్లను మాత్రం ఎందుకు ఇంత జాగ్రత్తగా, పద్దతిగా, పకడ్బందీగా విచారిస్తోంది. వాళ్లు సినిమా సెలబ్రిటీలు కనుకనే. కాకుండా, సాదా సీదా జనాలు అయితే, వాళ్లకు కాల్ డేటా అందగానే ఇళ్ల మీదకు వెళ్లి సోదాలు చేసేవారు. అదుపులోకి తీసుకునేవారు. అస్సలు నోటీసులు, తతంగమే వుండదు. పోలీసుల వ్యవహారశైలి తెలిసిన వారు ఎవరైనా ఇదే అవునని అంటారు.

అదే సమస్యగా కూడా వుంది. ఎక్సయిజ్ జనాలు సెలబ్రిటీల పట్ల అంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే, మీడియా మాత్రం ఎందుకు వార్తలు వండి వారుస్తోంది? అన్నది. సిట్ వాళ్ల రాతలన్నీ ఫైళ్లలో వుంటాయి. అవి అవసరం అయినపుడే బయటకు వస్తాయి. కానీ అవేరాతలు, మీడియా పరిచయాల కారణంగా ఊహాతీత వార్తలుగా బయటకు వస్తాయి. 

కానీ ఇవన్నీ ఆలోచించడంలేదు మీడియాకు వ్యతిరేకంగా కవిత్వాలు వొలికిస్తున్నవాళ్లు. ఏదీ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కదా? మా పూరికి ఎందుకిచ్చారు.. మా చార్మికి ఎందుకు ఇచ్చారు. అంటూ వాళ్లను నోటికి వచ్చినట్లు పోలికలు పోలుస్తూ కవిత్వాలు వొలికించమనండి. వాళ్లపై ప్రకటనలు చేయమనండి. అబ్బే.. అమ్మకు చిక్కిన మేకలు మీడియా జనాలే కదా? 

ఎక్సయిజ్ జనాలే చెప్పారు.. సినిమా వాళ్లు అల్లోవీరా జ్యూస్ లు తాగుతున్నారు, టీ టాక్సినేషన్ చేయించుకుంటున్నారని. ఇప్పుడు వాళ్లను అనండి.. ఏమంటారో? అలా తాగడం, ఇలా చేయడం మా వాళ్ల పర్సనల్ పనులు మీకెందుకు? అని క్వశ్చను చేయండి.

శ్రీశ్రీ ఏమన్నాడు.. ఈ కవులు, కళాకారులకు తెలియంది కాదు

ప్రయివేటు బతుకులు మీ స్వంతం.. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం.

ఎవరి ఇళ్లల్లో వాళ్లు వున్నంత వరకు ఎవరి కళ్లూ పడవు. ఒకసారి తెల్లచొక్కా వేసుకుని, ముహుర్తాలు చూసుకుని సిట్ మెట్లు ఎక్కాకే, లక్ష కళ్లు పడతాయి. వేల వార్తలు పుడతాయి.

సినిమా జనాలే కాదు. ఈ దేశంలో ప్రధాన మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి బంట్రోతు దాకా ఎవరైనా ఇలా వార్తల బారిన పడ్డవారే. అలాంటి వార్తల్లో నూటికి తొంభై నిజమని నిరూపితమైనవే.
వార్తల పోటీలో, సంచలన ప్రపంచపు పోకడల్లో కాస్త ఎక్కడైనా ఒకశాతం లేదా పదిశాతం అతి వుండొచ్చు. లేదని అనడంలేదు.

కానీ అలా మీడియా మొత్తాన్ని దుయ్యబట్టేసి, వాళ్ల రాతల్ని అశుద్ధంతో పోల్చేయడం అస్సలు సరికాదు. గమనించండి. ఇంకా ఇల్లే పూర్తిగా అలకలేదు. పండగ రాలేదు. సిట్ విచారణలో ఏం తేలుతుందో? తొందరపడి నోరు జారకుండా వుంటే బాగుంటుంది. సుద్దులు చెప్పండి. కానీ భాష చూసుకోండి.