అదిగో సినిమా అంటే ఇదిగో టైటిల్ అనేస్తున్నారు. ఇప్పుడు అలా తాజాగా పుట్టిన పూర్తి అబద్ధపు వార్త ఒకటి వుంది. హీరో కళ్యాణ్ రామ్, తన బ్యానర్లో నాని హీరోగా ఓ సినిమా నిర్మించబోతున్నాడు అన్నది ఆ వార్త. ఆ వార్త తెలిసి కళ్యాణ్ రామ్ నే ఆశ్చర్యపోయాడని వినికిడి. తనకే లేని ఈ ఆలోచన వార్తగా ఎలా వచ్చిందా? అని. ప్రస్తుతం నాని రెండేళ్ల వరకు ఫుల్ బిజీగా వున్నాడు. ఇక నిర్మాతగా, హీరోగా కూడా కళ్యాణ్ రామ్ బిజీగా వున్నాడు.
నిర్మాతగా జై లవకుశ పూర్తిచేసి విడుదల చేయాలి. ఆ టాస్క్ సెప్టెంబర్ ఎండ్ వరకు వుంది. ఇక హీరోగా రెండు సినిమాలు ఓకె చేసాడు. ప్రస్తుతం ఎమ్ఎల్ఎ సినిమా వర్క్ జరుగుతోంది. ఆ తరువాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సినిమా స్టార్ట్ కావాలి. ఆ తరువాత ఓ పెద్ద సినిమా కళ్యాణ్ రామ్ ప్లానింగ్ లో వుంది.
ఇన్ని వుండగా నానితో సినిమా అంటే ఆశ్చర్యపోయాడట కళ్యాణ్ రామ్.