పదకొండు కోట్ల సినిమా. హీరో రెమ్యూనిరేషన్, డైరక్టర్ రెమ్యూనిరేషన్ కాకుండా. హిందీ శాటిలైట్ 7కోట్లు, హిందీ ఇంటర్ నెట్ 2.5 కోట్లు, తెలుగు ఇంటర్ నెట్ 2.5 కోట్లు, తెలుగు శాటిలైట్ 3 కోట్లు, తమిళ్ శాటిలైట్ 2 కోట్లు, మళయాలం శాటిలైట్ 1.5 కోట్లు. మొత్తం కలిపితే 19.5 కోట్లు.
ఇవీ రానా లేటెస్ట్ సినిమా నేనే రాజు నేనే మంత్రి లెక్కలు. సినిమా స్టార్ట్ చేసేనాటికి డైరక్టర్ తేజ డౌన్ ఫాల్ లో వున్నారు. రానాకు సోలో హిట్ లేదు. అందుకే ఇద్దరికి రెమ్యూనిరేషన్ లేకుండా పావలా, పావలా వాటా ఇచ్చి సినిమా స్టార్ట్ చేసారు నిర్మాతలు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి. తీరా సినిమా స్టార్ట్ చేసాక, అన్ని విధాలా బజ్ వచ్చింది. దాంతో థియేటర్ రైట్స్ అన్నవి ఎక్కడా అమ్మకుండానే తొమ్మిది కోట్ల లాభం వచ్చేసింది.
ఇప్పుడు థియేటర్ హక్కులు అమ్మకుండా నాలుగు రాష్ట్రాల్లోనూ ఓన్ రిలీజ్ చేద్దామన్నది హీరో రానా తండ్రి దగ్గుబాటి సురేష్ ఆలోచన. ఎలాగూ ఖర్చులు ఫ్లస్ లాభాలు వచ్చేసాయి కాబట్టి, ఇక తెగే ప్రతి టికెట్ లాభమే అవుతుంది. అందుకే అమ్మకుండా విడుదల చేసుకుందాం అంటున్నారు.
కానీ మాంచి బజ్ వుంది. పైగా ప్రతి ఏరియాకు ఒకటికి ఇద్దరు అడుగుతున్నారు. అమ్మేస్తే, లెక్కలు తేల్చేసుకోవచ్చు అన్నది నిర్మాతల ఆలోచనగా వుంది. కానీ డిస్ట్రిబ్యూటర్ గా సినిమా తన చేతిలో వుంచుకోవాలన్నది సురేష్ ఆలోచనగా వున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి టఫ్ కాంపిటీషన్ లో విడుదలవుతున్నందున అమ్మేసుకుంటేనే బెటర్ అని ట్రేడ్ జనాల సలహా. కానీ దగ్గుబాటి సురేష్ విడుదల దగ్గరగా వచ్చేవరకు ఏ సంగతి తేల్చరన్నది ఆయన స్టయిల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలిసిన వారు చెప్పే సంగతి. ఇక అప్పుడు చేసేదేముంది? సినిమా ఆయన చేతిలో వుంచడం మినహా.