మంచి సినిమా వుంటే లటుక్కున పట్టేసుకుంటారు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. అలాంటిది కోరి ఇస్తామన్నా కూడా 'లై' సినిమాను ఎందుకు వదులుకున్నారు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. లై సినిమాను ఏరియాల వారీ అమ్మేసారు. నైజాం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు 14 రీల్స్ వాళ్లు. సినిమాను అభిషేక్ పిక్చర్స్ ద్వారా నైజాంలో పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
లై సినిమా టీజర్ తో మాంచి బజ్ సంతరించుకుంది. సినిమా మీద మాంచి అంచనాలే వున్నాయి. నలభై కోట్ల బడ్జెట్ తో తయారైన సినిమా ఇది. నితిన్ చాలా స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. మైండ్ గేమ్ సబ్జెక్ట్ తో తయారైన సినిమా. కానీ మరి ఇన్ని ప్లస్ పాయింట్లు వున్నా కూడా దిల్ రాజు ఎందుకు వెనకడుగు వేసినట్లు అన్నది ప్రశ్న.
దిల్ రాజు ఇప్పుడు తను బిజీగా వున్నానని, పైగా ఒకేరోజు మూడు నాలుగు సినిమాలు వుండడం వల్ల థియేటర్ల సమస్యలు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ దిల్ రాజకు నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డితో చిన్నచిన్న అపోహలు వున్నాయని అందుకే తీసుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు విషయాలు అలా వుంచితే, లై సినిమాను నైజాంకు తామే తీసుకుని, డిస్ట్రిబ్యూషన్ చేయాలని నితిన్ అనుకున్నట్లు ఆరంభంలో వార్తలు వినిపించాయి. పైగా నైజాంలో నితిన్ వాళ్లది కూడా కాస్త గట్టి పంపిణీ సంస్థనే. మరి వాళ్లు కూడా తీసుకోవడం కానీ, తమ దగ్గర పెట్టుకోవడం కానీ చేయకుండా అభిషేక్ పిక్చర్స్ కు ఎందుకు ఇచ్చినట్లో?