ఒకసారి ఓ సినిమా ట్రయ్ చేసి హిట్ కొట్టినంత వరకు ఓకె. కానీ ఒకసారి దర్శకుడు అయిపోయిన తరువాత వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ట్రయ్ చేయాలి. ఒకటే జోనర్ లో అటు ఇటు చేస్తూ తీస్తూ వుంటే, జనాలకు అనుమానం వచ్చేస్తుంది. నక్కిన త్రినాధరావు గతంలో రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మావా అనే సినిమా తీసారు. సూపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత నానితో నేను లోకల్ సినిమా చేసారు. అది కూడా దాదాపు సినిమా చూపిస్తా మావా జోనర్ నే.
ఇప్పుడంటే ఇప్పుడు కాకపోయినా, కొన్నాళ్ల తరువాత అయినా నక్కిన త్రినాధరావు యంగ్ మెగాస్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నారని గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి. పైగా అది కూడా ఎప్పుడో బాపు డైరక్ట్ చేసిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాకు అప్ టు డేట్ వెర్షన్ అంట. అంటే ఓ విధంగా రీమిక్స్ అనుకోవాలి.
కానీ విషయం ఏమిటంటే ఆ సినిమా కూడా ఇలాంటి జోనరే. మంత్రిగారితో వియ్యం అందుకోవాలని తహతహలాడే మామగారి భరతం పట్టిన అల్లుడి కథ. అంటే మళ్లీ అదే లైన్ లో వెళ్లాలని నక్కిన త్రినాధరావు డిసైడ్ అయ్యారని అనుకోవాలా?