బోయపాటి-ఒరిజినల్ అలాగే వుంది

జయ జానకీ నాయక అంటూ టైటిల్ అనౌన్స్ చేయడంతోనే జనాల ఆసక్తిని తన సినిమా వైపు తిప్పుకున్నాడు డైరక్టర్ బోయపాటి శ్రీనివాస్. తన లేటెస్ట్ సినిమాను హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సంగతి…

జయ జానకీ నాయక అంటూ టైటిల్ అనౌన్స్ చేయడంతోనే జనాల ఆసక్తిని తన సినిమా వైపు తిప్పుకున్నాడు డైరక్టర్ బోయపాటి శ్రీనివాస్. తన లేటెస్ట్ సినిమాను హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ టీజర్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా, కూల్ గా అందించి మళ్లీ మరోసారి జనాలకు ఆసక్తి పెంచేసాడు.

సినిమా జనాలు ఈసారి బోయపాటి డిఫరెంట్ గా ఏదో చేస్తున్నాడు అనుకనేలా చేసాడు ఆ టీజర్ తో. కానీ అంతలోనే మళ్లీ మరో టీజర్ ను వదిలాడు పక్కా తను, తన మాస్ స్టయిల్ ను చూపించి, శుక్రవారం కొత్త సినిమాలతో పాటు ఆ టీజర్ ను విడుదల చేసి, థియేటర్లను మోత మోగించేసాడు దీంతో జనాలు, హమ్మయ్య, బోయపాటి ఒరిజినల్ లోపల అలాగే వుంది అని ఫిక్స్ అయ్యారు.

ఈ టీజర్ లో హీరో శ్రీనివాస్ పూనకం వచ్చినట్లు జనాల్ని బాదేసి, హీరోయిన్ కు నేనున్నా అనే డైలాగు వదిలేసాడు. ఇంక ఇప్పుడు క్లారిటీ రావాల్సిన విషయం ఒకటి వుంది. బోయపాటి తన ఒరిజినల్ ను, ఈ మారిన క్లాస్ లుక్ ను ఏ మేరకు, ఏయే రేషియోలో మిక్స్ చేసాడు అన్నది. అది తెలియాలంటే ట్రయిలర్ బయటకు రావాలి. 

ఈనెల 28న ట్రయిలర్ ను నేరుగా థియేటర్లలోకి వదిలే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 28న గౌతమ్ నందా విడుదలవుతోంది. పక్కా కమర్షియల్ సినిమా. దాంతో పాటు బోయపాటి సినిమా ట్రయిలర్ అంటే డీటీఎస్ బాక్స్ లు మోత మోగుతాయేమో?