యువి పంట పండింది

యువి క్రియేషన్స్ సినిమాల ప్లాన్ భలేగా వుంటుంది. మీడియం రేంజ్ సినిమాలు ప్లాన్ చేస్తారు. మంచి లాభాలు కళ్ల చూస్తారు. లేటెస్ట్ గా శర్వానంద్-మారుతి కాంబినేషన్ లో మహానుభావుడు సినిమా చేస్తున్నారు. ఆల్ మోస్ట్…

యువి క్రియేషన్స్ సినిమాల ప్లాన్ భలేగా వుంటుంది. మీడియం రేంజ్ సినిమాలు ప్లాన్ చేస్తారు. మంచి లాభాలు కళ్ల చూస్తారు. లేటెస్ట్ గా శర్వానంద్-మారుతి కాంబినేషన్ లో మహానుభావుడు సినిమా చేస్తున్నారు. ఆల్ మోస్ట్ 60 పర్సంట్ అయిపోయింది.

ఇప్పుడు ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు మూడుకోట్లకు పైగా రేటుకు అమ్మేసారు. అలాగే కర్ణాటక, అదర్ ఏరియాలు రెండుకోట్లకు అమ్మేసారు. శాటిలైట్ కూడా ఆరు కోట్లకు పైగా రేటుకు జెమినికి ఇచ్చేసారు. అంటే పదికోట్లు రిటర్న్ పక్కా అయిపోయింది. ఇంకా ఉభయ తెలుగు రాష్ట్రాల హక్కులు చేతిలో వుండగానే. 

కానీ సినిమాకు ఖర్చు చూస్తే పదికోట్లకు మించదు. మారుతి, శర్వానంద్ రెమ్యూనిరేషన్ లకు కలుపుకున్నా పదికోట్ల రేంజ్ లో సినిమా ఫినిష్ అవుతుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు, హిందీ డబ్బింగ్ డబ్బులు ప్రాఫిట్ అన్నమాట.

ప్రస్తుతం ఈ సినిమా షూట్ రామోజీ ఫిలిం సిటీలోనూ, పోచంపల్లి గ్రామంలోనూ జరుగుతోంది. ఆగస్టులో పొల్లాచ్చిలో జరిగే షెడ్యూలుతో దాదాపు పూర్తయిపోతుంది. ఒకటి రెండు పాటలు మాత్రం మిగుల్తాయి. సినిమాను ఖాళీగా వున్న స్లాట్ చూసి వదలడానికి వీలుగా రెడీ చేసి వుంచుకుంటారట.