డ్రగ్స్ దొరక్క సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదంలో ఓ ప్రముఖ హీరో పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మాస్ జనాల్లో బాగా పాపులర్ అయిన ఆ హీరోకు కూడా ఎక్సైజ్ పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ మీడియాలో…

టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదంలో ఓ ప్రముఖ హీరో పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మాస్ జనాల్లో బాగా పాపులర్ అయిన ఆ హీరోకు కూడా ఎక్సైజ్ పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ సెక్షన్ మీడియా అయితే ఆ వ్యక్తి పేరును కూడా బహిరంగంగా ప్రకటించింది. ఇప్పుడా హీరోనే డ్రగ్స్ లేక అల్లాడిపోతున్నాడట. సినిమాలపై సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతున్నాడట.

పాపులారిటీ ఉన్నప్పటికీ ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు ఆ హీరో. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. కానీ ఇంతలోనే డ్రగ్స్ రాకెట్ నెట్ వర్క్ కట్ అయింది. హీరోగారికి ఠంచనుగా అందాల్సిన మాల్ అందడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాపై సరిగ్గా దృష్టిపెట్టలేకపోతున్నాడట సదరు హీరో.

పరిశ్రమకు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారైన కెల్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరికొందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యతో మిగతా వాళ్లు తమ నెట్ వర్క్ ను దాదాపు ఆపేశారు. ప్రస్తుతం డ్రగ్స్ సరఫరా చేయడానికి జంకుతున్నారు. దీంతో రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకునే వ్యక్తులకు సరఫరా నిలిచిపోయింది. వీళ్లలో ఆ హీరో కూడా ఉన్నాడట.

ఎంతో కష్టపడి పైకొచ్చాడు. లుక్ కాపాడుకునేందుకు చాలా తంటాలు పడుతుంటాడు. అతడిపై పరిశ్రమలో కొందరు పెద్ద మనుషులకు ఎప్పట్నుంచో గుర్రుగా ఉంది. అందుకే ఇలా డ్రగ్స్ వివాదం తెరపైకి వచ్చిందో లేదో అలా ప్రెస్ మీట్ పెట్టించి అతడ్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారట.