టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో పార్ట్-2

టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదిలింది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం 15మందికి నోటీసులు అందాయి. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద వీళ్లందరికీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. వ్యక్తిగతంగా హాజరై…

టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదిలింది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం 15మందికి నోటీసులు అందాయి. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద వీళ్లందరికీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని లేదంటే అరెస్టు తప్పదని చేసే హెచ్చరిక ఇది. ఇప్పుడు ఈ వ్యవహారానికి పార్ట్-2 రాబోతోంది. ఈసారి కొంతమంది హీరోయిన్లకు సమన్లు అందించేందుకు సిద్ధమౌతున్నారట పోలీసులు.

సెకెండ్ ఫేజ్ లో భాగంగా పది మంది హీరోయిన్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరింత సంచలనం అవుతుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు మరికొందరు హీరోయిన్లు, ఒక ఆర్ట్ డైరక్టర్, మరో సినిమాటోగ్రాఫర్ కు నోటీసులు అందబోతున్నాయట.

కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు ప్రసార మాధ్యమాల్లో రాగా… తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నందు లాంటి వ్యక్తులు మీడియా ముందుకొచ్చి వాటిని ఖండించారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు నోటీసులు కూడా రాలేదని తనీష్ వివరణ ఇచ్చాడు. అటు సుబ్బరాజు అయితే డ్రగ్స్ తీసుకోకుండానే తనకు నోటీసులు ఎందుకిచ్చారో అర్థం కావడం లేదని అంటున్నాడు.