దిల్ రాజు హ్యాండు పడితే ఎవరికైనా సుడి తిరుగుతుందని అంటుంటారు. ఒకరిద్దరు హీరోలు, దర్శకులు తప్ప మిగతా వారంతా దిల్ రాజు క్యాంపులోకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లే వున్నారు. తన చిత్రాల విషయంలో అమితమైన జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజుపై నమ్మకంతో 'ఫిదా' చిత్రాన్ని వరుణ్ తేజ్ అతని బ్యానర్లో చేసేసాడు.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న వరుణ్ తేజ్‌కి ఫామ్‌లో లేని శేఖర్ కమ్ములతో పని చేసే అవకాశం వచ్చింది. మహేష్, చరణ్ రిజెక్ట్ చేసిన ఈ స్టోరీలో సత్తా వుందని దిల్ రాజు భావించాడు. అందుకే మిగతా హీరోలు రిజెక్ట్ చేసినా కానీ ఈ చిత్రాన్ని ఏరి కోరి వరుణ్ తేజ్‌తో తీసాడు.
మెగా ఫ్యామిలీనుంచే వచ్చిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ షేప్ చేయడంలో దిల్ రాజు పాత్ర చాలా వుంది. అల్లు అర్జున్ కెరీర్ టర్నింగ్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ నుంచే వచ్చింది.
అదే విధంగా తనని కూడా సక్సెస్‌ఫుల్ హీరోని చేస్తాడని వరుణ్ తేజ్ నమ్ముతున్నాడు. శేఖర్ కమ్ముల కూడా ఫిదా విషయంలో బేషజాలకి పోకుండా మార్పులేమైనా చేయాల్సి వస్తే చేయండంటూ దిల్ రాజుకి పూర్తి అధికారాలిచ్చేసాడట. మరి దిల్ రాజు చేతిలో మెగా హీరో జాతకం మారుతుందో లేదో చూడాలిక.