సినిమాలన్నీ చకచకా రెడీ అయిపోయి విడుదల డేట్ లు వెదుక్కుంటున్నాయ్. ఈ కోవలోనే మరో సినిమా కూడా ఈ నెలలోనే విడుదలకు సిధ్ధం అయిపోతోంది. నారా రోహిత్ –నమితా ప్రమోద్, నాగ శౌర్య నటించిన కథలో రాజకుమారి సినిమా కూడా ఈ నెలలోనే విడుదలవుతోంది.
ఈనెల 28న విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయింది. సినిమాలో విలన్ గా నటించే క్యారెక్టర్ ను ఈ సినిమాలో నారా రోహిత్ పోషిస్తున్నాడు. వైవిధ్యమైన కథతో తయారైన ఈ సినిమాకు మహేష్ సూరపనేని దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే ఫినిష్ అయిపోయింది కానీ, సరైన డేట్ కోసం చూస్తోంది.
సినిమా మార్కెటింగ్ చాలా వరకు పూర్తి కావడం, శాటిలైట్ ఆఫర్ బాగానే వుండడంతో ఆలస్యం చేయకుండా ఈ నెల 28న విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారు.
ఇప్పటికే సినిమాలో పాటలు ఆన్ లైన్ లోకి వదిలేసారు. టీజర్లు, ట్రయిలర్లు వచ్చేసాయి. జస్ట్ ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి, సినిమాకు కాస్త ఊపు తెచ్చి విడుదల చేయడమే మిగిలింది. ప్రస్తుతం యూనిట్ ఆ పని మీదే బిజీగా వుందట.