ఇండిగో విమాన సిబ్బందితో విశాఖలో ఘర్షణ పడడంతో, పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర రెడ్డి పై వీదేశీయ విమాన యాన సంస్థలు నిషేధం విధించాయి. ప్రస్తుతం అది కొనసాగుతోంది. అయితే ఆంధ్రకు చెందిన ఒక్క ఎయిర్ లైన్స్ సంస్థ మాత్రం తాము ఏ నిషేధం విధించలేదని చెప్పింది.
ఇదిలా వుంటే జేసి కనుక, ఏదో జరిగిపోయింది, ఇది దురదృష్టకరం అనే టైపులో ఓ మాట అంటే, మిగిలిన పని తెలుగుదేశం పెద్దలు చూసుకుంటారు. కానీ అస్సలు ఆ ఆలోచనలో జేసి లేనట్లు తెలుస్తోంది.
ఎన్నోసార్లు ఇండిగో సిబ్బంది తీరుతో విసిగి, ఆ రోజు ఫ్రస్టేట్ అయినట్లు జేసీ అనునాయులు చెబుతున్నారు. అందువల్ల అవసరం అయితే ఆల్టర్ నేటివ్ చూసుకుంటా కానీ, క్షమాపణ మాత్రం చెప్పే ప్రసక్తే లేదని జెసి అంటున్నట్లు వినికిడి.
ఇదిలా వుంటే ఈ విషయమై న్యాయపోరాటం చేయడానికి వీలుందా? అసలు ఓ వ్యక్తిపై నిషేధం విధించే హక్కు ఎయిర్ లైన్స్ సంస్థలకు ఏ మేరకు వుంది. ఒక సంస్థతో సమస్య వస్తే, మిగిలిన సంస్థలు కూడా నిషేధం విధించడం ఎంత వరకు న్యాయబద్ధం? ఇలాంటి పాయింట్లు అన్నీ జేసి కి చెందిన న్యాయ సలహా దారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఏ మాత్రం అవకాశం వున్నా, ఈ విషయమై న్యాయపోరాటం చేసే ఆలోచనలో జేసి వున్నట్లు తెలుస్తోంది.