తెలుగు టెలివిజన్ తెర మీదనే తొలి భారీ సెలబ్రిటీ షో గా దూసుకువస్తోంది బిగ్ బాస్. స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రామ్ 70 రోజుల పాటు వుంటుంది. ఈ 70 రోజులు దాదాపు పూనేలోనే వుండిపోయాల్సి వుంటుంది బిగ్ బాస్ విషయంలో లీడ్ రోల్ పోషిస్తున్న హీరో ఎన్టీఆర్.
వారానికి రెండు సార్లు వంతున బిగ్ బాస్ షో కి వెళ్లాలి. మిగిలిన రోజులు కూడా వీలయినంత వరకు అందుబాటులో వుండాలి. లాస్ట్ డే అన్నది సెప్టెంబర్ 21 గా ఫిక్సయింది. అంటే జై లవకుశ రిలీజ్ డేట్ వరకు అన్నమాట.
ఈ నెల రెండో వారానికే ఎన్టీఆర్ పూనే షిప్ట్ అయిపోవాలి. కానీ జై లవకుశ షూటింగ్ ఇంకా వుంది. అందుకే ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకున్న డెసిషన్ ఏమిటంటే, బిగ్ బాస్ లోకేషన్ అయిన పూనే కే జై లవకుశ యూనిట్ ను కూడా షిప్ట్ చేయాలని, అక్కడే మిగిలిన షూట్ అంతా కంప్లీట్ చేస్తారన్న మాట. ఒక పక్క బిగ్ బాస్ ను నిర్వహిస్తూనే, మరో పక్క షూటింగ్ ఫినిష్ చేస్తాడన్నమాట ఎన్టీఆర్. ప్లానింగ్ అదిరిందిగా.